కాంగ్రెస్ తెలివితక్కువ తనం.. సాక్ష్యంగా ప్రియాంక చోప్రా

First Published Jul 13, 2018, 1:21 PM IST
Highlights

నేపథ్యంలో  సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీని ఫుల్ చేయబోయి.. కాంగ్రెస్ నేతలే ఫూల్ అయ్యారు.
 

నేషనల్ కాంగ్రెస్ మరోసారి తన తెలివి తక్కువ తనాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రూవ్ చేసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్  అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో తప్పులు దొర్లిస్తూ.. పలు మార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే.. కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో  సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీని ఫుల్ చేయబోయి.. కాంగ్రెస్ నేతలే ఫూల్ అయ్యారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... రీసెంట్ గా కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేసింది. అదేంటంటే.. ‘‘ ప్రధాని నరేంద్రమోదీ సాయిల్ టెస్టింగ్ ల్యాబరేటరీల గురించి కూడా అబద్ధం చెబుతున్నారు. యూపీఏ హయాంలో 1141 సాయిల్ టెస్టింగ్ ల్యాబరేటరీలు ఏర్పాటు చేశాం’’ అని ట్వీట్ చేశారు.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ ట్వీట్ చివరలో తమ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేదిని ట్యాగ్ చేయబోయి.. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేశారు. అంతే.. ఇక విమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్ మరోసారి తెలివి తక్కువ పనిచేసిందంటూ పలువురు నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

అయితే.. ట్వీట్ చేసిన కొద్ది సేపటికే.. తమ తప్పుని గ్రహించి.. ఆ ట్వీట్ ని డిలీట్ చేయడం గమనార్హం.


 

click me!