ఉగ్రవాదుల కాల్పుల్లో సీఆర్పీపిఎఫ్ ఎస్సై, కానిస్టేబుల్ మృతి

First Published Jul 13, 2018, 1:08 PM IST
Highlights

జమ్మూ కాశ్మీర్ లో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. సీఆర్పీఎఫ్ జవాన్ల  బృందాన్ని టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  

ఈ ఘటన అనంత్‌నాగ్ జిల్లాలో చోటుచేసుకుంది. అచబాల్ చౌక్ వద్ద విధులు నిర్వహిస్తున్న సీఆర్ఫీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యే లోపే టెర్రరిస్టులు అక్కడినుండి పరారయ్యారు. అయితే వారు జరిపిన కాల్పుల్లో సీఆర్పిఎఫ్ ఎస్సై మీనా, కానిస్టేబుల్ సందీప్ లు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ సాధారణ పౌరుడితో పాటు మరో జవాన్ ఉన్నారు.

క్షతగాత్రులను భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే ఈ కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులకోసం కూంబింగ్ కొనసాగుతోంది.  

click me!