కాంగ్రెస్ నేత సంజయ్ ఝాకు పాజిటివ్: జనానికి జాగ్రత్తలు

By Siva KodatiFirst Published May 22, 2020, 5:34 PM IST
Highlights

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా కోవిడ్ 19 బారినపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఝాకు కరోనా పాజిటివ్‌గా తేలింది

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా కోవిడ్ 19 బారినపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఝాకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తనకు కరోనా పాజిటివ్ అని తేలలింది. రాబోయే 10-12 రోజులు తాను హోం క్వారంటైన్‌లో ఉండబోతున్నా.. వైరస్ లక్షణాలను తక్కువగా అంచనా వేయవద్దని సంజయ్ హెచ్చరించారు.

Also Read:దేశంలో పెరిగిన కరోనా విజృంభణ.. 24గంటల్లో 6వేలకు పైగా కొత్త కేసులు

మనందరికీ కరోనా ప్రమాదం పొంచి వుందన్న ఆయన ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సంజయ్ ఝా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు సంజయ్ ఝా త్వరగా కోలుకోవాలని రీట్వీట్ చేశారు.

కాగా దేశంలో కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరిగిపోతోంది. లాక్‌డౌన్ 4లో కొన్ని సడలింపులు చేయడంతో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో దేశంలో కోవిడ్ 19 బాధితుల సంఖ్య 1,18,226కి చేరుకుంది.

Also Read:స్వరాష్ట్రానికి చేరిన వలస కార్మికుడు.. క్వారంటైన్ లో ఆత్మహత్య

ఒక్క మహారాష్ట్రలోనే 2,334 కేసులు నమోదు కావడం గమనార్హం. అక్కడ వరుసగా ఆరో రోజు పాజిటివ్ కేసులు 2 వేల మార్క్ దాటడం గమనార్హం. 

click me!