21 ఏళ్ల యువతిపై ఆరో తరగతి బాలుడి వేధింపులు: పోలీసులు షాక్

By Siva KodatiFirst Published May 22, 2020, 4:57 PM IST
Highlights

చిన్నారుల్లోనూ నేరచరిత్ర అంతకంతకూ పెరిగిపోతుంది. తాజాగా ఆరో తరగతి చదివే పిల్లాడు.. 21 ఏళ్ల యువతిని లైంగికంగా వేధిస్తున్నాడు. 

చిన్నారుల్లోనూ నేరచరిత్ర అంతకంతకూ పెరిగిపోతుంది. తాజాగా ఆరో తరగతి చదివే పిల్లాడు.. 21 ఏళ్ల యువతిని లైంగికంగా వేధిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్‌కు చెందిన బాధిత యువతి, సదరు బాలుడు.. విద్యార్ధులు క్రియేట్ చేసిన ఓ టెలిగ్రామ్‌ గ్రూప్‌లో మెంబర్లు.

ఈ గ్రూపులో అన్ని వయసుల విద్యార్ధులు ఉంటారు. జూనియర్లకు, సీనియర్ విద్యార్ధులు అనుమానాలు క్లియర్ చేస్తూ... వారికి సాయం చేస్తుంటారు. ఈ క్రమంలో డిగ్రీ చదివి.. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న యువతి ఈ గ్రూపులో జాయిన్ అయ్యింది. 6వ తరగతి చదువుతున్న ఆ పిల్లాడు కూడా ఈ గ్రూపులో సభ్యుడే.

అలా ఇద్దరికి పరిచయం కుదరింది. బాధిత యువతితో చదువకు సంబంధించిన విషయాలు చర్చించడంతో మంచివాడిగా నమ్మకం సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 17న తెల్లవారుజామున ఆ పిల్లాడు.. యువతి మొబైల్‌కు ఆమె మార్ప్‌డ్ చిత్రాలు పంపించాడు.

దీంతో ఆ యువతి షాక్‌కు గురైంది. ఆ వెంటనే బాలుడి నుంచి ఫోన్ వచ్చింది. సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఫోటోలను తీసుకున్నానని.. తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని.. లేదంటే తనతో సెక్స్ ఛాట్ చేయాలని బెదిరించాడు.

లేనిపక్షంలో ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అంతేకాకుండా ఫోన్‌ను హ్యాక్ చేశానని చెప్పడంతో.. భయపడిన ఆ యువతి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. అనంతరం ఆ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో బాలుడిని ఇంటికి పిలిపించి మాట్లాడారు.

కానీ వాడిలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని, అతడి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించగా.. మెసేజ్‌ల గురించి తనకు ఏం తెలియదని, తన ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేశారని తెలిపాడు.

దీంతో పోలీసులు సోషల్ మీడియా కంపెనీతో మాట్లాడి యువతి, పిల్లాడి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని పంపాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్‌లు ఇవ్వొద్దని.. ఇచ్చినా వారిపై ఓ కంట కనిపెడుతూ ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరించారు.

click me!