ఆంఫన్ తుఫాన్ దెబ్బ: బెంగాల్‌కు రూ. 1000 కోట్ల సహాయం ప్రకటించిన మోడీ

By narsimha lodeFirst Published May 22, 2020, 3:48 PM IST
Highlights

అత్యంత తీవ్ర తుఫాన్ అంఫన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రూ. 1000 కోట్లను అత్యవసర  సహాయంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

కోల్‌కతా: అత్యంత తీవ్ర తుఫాన్ అంఫన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రూ. 1000 కోట్లను అత్యవసర  సహాయంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

శుక్రవారం నాడు ప్రధాని మోడీ బెంగాల్ ముఖ్యమంత్రి మమ బెనర్జీతో కలిసి ఆంఫన్ తీవ్రతతో దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఉత్తర పరగణల జిల్లాలోని బషీర్ హాత్ లో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో తుఫాన్ నష్టాన్ని కేంద్ర బృందం సమగ్రంగా అంచనా వేయనుందన్నారు. ప్రకృతి విలయం కారణంగా తీవ్రంగా నష్టపోయిన బెంగాల్ ను పునర్మించేందుకు తమ వంతు సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తుపాన్ బాధిత ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొంటాయని మోడీ స్పష్టం చేశారు. తుఫాను కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రూ. 3 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారం ప్రకటించారు మోడీ.

also read:ఆంఫన్ తుఫాన్ ఎఫెక్ట్: నీట మునిగిన కోల్‌కత్తా ఎయిర్ పోర్టు, 15 మంది మృతి

రాష్ట్రంలోని 60 శాతం ప్రజలు తుఫాన్ ప్రభావానికి గురయ్యారని బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఇవాళ మీడియాకు తెలిపారు. సాధారణ పరిస్థితి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని ఆమె తెలిపారు. మంత్రులు, అధికారులు బాధితులను ఆదుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పారు.

ఆంఫన్ తుఫాన్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. బెంగాల్ రాష్ట్రంలో తుఫాన్ కారణంగా సుమారు 72 మంది మృతి చెందారు. కోల్ కత్తా నగరంలో విద్యుత్ నిలిచిపోయింది. 

సుమారు వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావంతో సుమారు 7 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెంగాల్ నుండి ప్రధాని మోడీ ఒడిశాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు బయలుదేరారు. 

click me!