నిన్న సల్మాన్ ఖుర్షీద్.. నేడు రషీద్ అల్వీ.. రామభక్తులు నిశాచరులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు...

By AN TeluguFirst Published Nov 12, 2021, 3:04 PM IST
Highlights

 ‘జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్న వాళ్లు రుషులేమీ కాదు, దెయ్యాలు. అప్రమత్తంగా ఉండాలి’అని కాంగ్రెస్ సీనియర్ నేత రషీద్ అల్వీ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత రషీద్ అల్వీ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామభక్తులను నిశాచరులతో (దెయ్యాలు) పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒక ఈవెంట్ లో రషీద్ అల్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్న వాళ్లు రుషులేమీ కాదు, దెయ్యాలు. అప్రమత్తంగా ఉండాలి’అని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీ ఖండన...
Rashid Alvi వ్యాఖ్యల మీద బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ 
Amit Malaviya ఓ ట్వీట్ లో మండిపడ్డారు. అల్వీ వ్యాఖ్యలు చేసిన వీడియోలను తన ట్వీట్ కు జతచేసి, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. సల్మాన్ ఖుర్షీద్ తర్వాత కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ రామభక్తులను దెయ్యాలతో పోల్చారు. 
Ram bhaktల పట్ల కాంగ్రెస్ విషపూరిత ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

రాముడితో రాజకీయాలేంటి?
రాముడిని రాజకీయం చేయడం తగదని, రామ భక్తులపై వ్యాఖ్యలు సమంజసం కాదని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ అన్నారు. ‘రాముడితో రాజకీయాలు చేయకండి. రామ భక్తుల మనోభావాలను ఇలాంటి వ్యాఖ్యలు గాయపరుస్తాయి. ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారు’ అని ఆయన పేర్కొన్నారు. హిందుత్వను ఇస్లామిక్ జీహాదీ సంస్థలైన ఐఎస్ఐఎస్, బొకోహరాంతో పోలుస్తూ కాంగ్రెస్ నేత Salman Khurshid తన తాజా పుస్తకం ‘సన్ రైజ్ ఓవర్ అయోధ్య’లో రాయడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో రషీద్ అల్వీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన సన్ రైజ్ ఓవర్ అయోధ్య అనే పుస్తకంతో ఆయన తనతో పాటు కాంగ్రెస్ పార్టీ అదినేత్రి సోనియాగాంధీ, నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలను కూడా వివాదంలోకి లాగారు. 

ప్రతి దానికి పారిపోతున్నారు: రాహుల్‌పై సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు

Sunrise over Ayodhya అనే ఈ పుస్తకంలో ఖుర్సీద్.. హిందూత్వను ఐఎస్ఐఎస్, బొకొహారం వంటి ఉగ్రవాద సంస్థలతో పోల్చారు. ఈ పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించగా 24 గంటల్లో ఖుర్షీద్ మీద కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలసులకు వివేక్ గార్గ్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. హిందుత్వకు అప్రతిష్ట తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఖుర్షీద్ మీద కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను అభ్యర్థించారు. దీనిపై బీజేపీ మండి పడింది. రాహుల్, సోనియా, ప్రియాంకలమీద విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. 

అయితే దీనిమీద స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఐఎస్ఐఎస్ తోనూ, జిహాదీ ఇస్లాంతోనూ హిందుత్వను పోల్చడాన్ని తప్పుపట్టారు. ఈ అంశం మీద ఖుర్షీద్ అతిశయోక్తులు రాశారని పేర్కొన్నారు. హిందుత్వ పై సల్మాన్ ఖుర్షీద్ తన పుస్తకంలో రాసిన అభిప్రాయంతో ఏకీ భవించలేమన్నారు. సమ్మిళిత హిందూయిజంలో భాగమైన హిందుత్వ ఒక ప్రత్యేక రాజకీయ సిద్ధాంతం అని తాము అంగీకరించబోమని ఆజాద్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. 

click me!