‘నన్నెందుకు వేధిస్తున్నావ్.. నేనేం పాపం చేశాను..’ సెల్ఫీ వీడియో తీసుకుని ఆ భర్త చేసిన పని...

Published : Nov 12, 2021, 01:51 PM IST
‘నన్నెందుకు వేధిస్తున్నావ్.. నేనేం పాపం చేశాను..’ సెల్ఫీ వీడియో తీసుకుని ఆ భర్త చేసిన పని...

సారాంశం

‘నేనేం పాపం చేశాను.. ఎందుకిలా వేధిస్తున్నావ్.. గొడవలు జరగడానికి కారణం నేనా? నువ్వా? నువ్వే ఓసారి ఆలోచించుకో.. నేనెప్పుడు కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేదు..’ అని ఏడ్చుకుంటూ చెప్పాడు.

భర్తతో గొడవపడి భార్య బయటకు వెళ్లింది. కోపం తగ్గిన తరువాత ఇంటికి తిరిగొచ్చేసింది. కానీ, ఆమె ఇంటి తలుపు తీయగానే షాకింగ్ సీన్ కనబడింది. ఈ సంఘటన రాజస్థాన్ లోని భిల్వార్ పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...

స్థానిక పట్టణంలోని తిక్రీ గ్రామానికి చెందిన ఖుష్రాజ్ మీనా(30)కు, ప్రియాంక అనే మహిళతో ఎనిమిదియేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. ఖుష్రాజ్ ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తూ ఇంటిని పోషిస్తున్నాడు. అయితే, గతకొద్ది రోజులుగా భార్యభర్తలిద్దరి మధ్య conflicts మొదలయ్యాయి. గురువారం కూడా ఖుష్రాజ్, ప్రియాంక గొడవ పడ్డారు. 

husbandతో గొడవ అనంతరం ప్రియాంక బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా.. ‘బయటకు వెళ్లకు.. ఏదైనా ఉంటే మాట్లాడు’ అని ఖుష్రాజ్ వేడుకున్నాడు. కానీ ఆమె వినలేదు. 

ఆమె బయటకు వెళ్లడం చూసి ఖుష్రాజ్ కు ఏడుపు వచ్చింది. గుక్కపట్టి ఏడుస్తూ ఓ selfie video తీసుకున్నాడు. అందులో తనకున్న బాధను మొత్తాన్ని చెప్పుకున్నాడు. ‘నేనేం పాపం చేశాను.. ఎందుకిలా వేధిస్తున్నావ్.. గొడవలు జరగడానికి కారణం నేనా? నువ్వా? నువ్వే ఓసారి ఆలోచించుకో.. నేనెప్పుడు కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేదు..’ అని ఏడ్చుకుంటూ చెప్పాడు. ఆ తర్వాత వైర్ ను గొంతును బిగించుకుని ఖుష్రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. 

కంగనా నుంచి పద్మ అవార్డు వెంటనే వెనక్కి తీసుకోవాలి.. పార్టీల డిమాండ్

బయటకు వెళ్లిన ప్రియాంక కాసేపటికి ఇంటికి వచ్చింది. తలుపు తీయగానే భర్త అచేతన స్థితిలో పడి ఉండడం చూసి షాక్ కు గురైంది. భర్త suicide చేసుకుని చనిపోయాడని తెలిసి భోరున విలపించింది. ఆమె అరుపులు విని పక్కింటివాళ్లు వచ్చారు. cell phoneలో ఉన్న సెల్ఫీ వీడియో చూసి ప్రియాంక తీవ్రంగా దు:ఖించింది.

‘అయ్యో.. ఎంతపనైపోయిందే..’ అని గుండెలు బాదుకుంటూ రోదించింది. హానుమాన్ నగర్ పోలీసులకు సమాచారం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

హనుమాన్ నగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవని, గురువారం కూడా మరోసారి గొడవ జరగడంతో ఖుష్రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించమన్నారు. 

PREV
click me!

Recommended Stories

Indian Railways: గుడిని వదలరు..గుడిలో లింగాన్ని వదలరు..మరీ ఇంత కక్కుర్తా..? ట్రైన్‍లో ఇవి కూడా వదలరా?
జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets