రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం ప‌ని చేస్తుంది - సీఎం అశోక్ గెహ్లాట్

By team teluguFirst Published Oct 1, 2022, 3:17 PM IST
Highlights

రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తి కాలాన్ని పూర్తి చేస్తుందని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్న ప్రయత్నాలు సఫలం కావని చెప్పారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుందని రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. వచ్చే బడ్జెట్‌ను విద్యార్థులు, యువతకు అంకితం ఇస్తామ‌ని తెలిపారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న బీజేపీ ప్లాన్ ను స‌క్సెస్ కానివ్వ‌బోమ‌ని చెప్పారు. శ‌నివారం గ్రామీణ యువజన ఒలింపిక్స్‌కు సంబంధించిన వివిధ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు గెహ్లాట్ బికనీర్ డివిజన్‌లో పర్యటించారు.

5జీ లింక్ ద్వారా ఢిల్లీలో కూర్చుని స్వీడన్‌లోని కారు నడిపిన ప్రధాని మోడీ.. (వీడియో)

ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఐదో బడ్జెట్‌ను సమర్పిస్తుందా అని మీడియా ఆయ‌న‌ను ప్ర‌శ్నించింది. దీనికి ఆయ‌న స‌మాధానం ఇస్తూ ‘‘ మేము ఐదేళ్లు పూర్తి చేస్తాం. విద్యార్థులు, యువత కోసం తదుపరి బడ్జెట్‌ను సమర్పిస్తాం ’’ అని ఆయన అన్నారు.  అనంత‌రం బీజేపీపై విరుచుకుపడుతూ.. ‘‘మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోకుండా ఉండేందుకు వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంతకుముందు కూడా బీజేపీ హార్స్ ట్రేడింగ్ కు ప్రయత్నించింది. కాని మా ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉన్నారు. వారు కదలలేదు. గత సారి ప్రభుత్వం నిల‌బ‌డింది. ఈ సారి ఇంకా బ‌లంగా ఉంది. ’’ అని అన్నారు. 

పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే నో పెట్రోల్.. నో డీజిల్!.. 25వ తేదీ నుంచి అమలు

యువత, విద్యార్థులు, ప్రజలు తమ సలహాలను నేరుగా తనకు పంపాలని గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. దీని వల్ల ప్రభుత్వం మెరుగైన పథకాలను తీసుకురావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. దేశంలో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షాన్ని అందించలేకపోయిందనే ఆరోపణలపై గెహ్లాట్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ బీజేపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిందని అన్నారు. 

డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ చైర్మన్‌గా గులాం నబీ ఆజాద్ ఎన్నిక‌

అంతే కాకుండా కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ దేశ ప్రజలకు ఒక సందేశాన్ని పంపుతోందని అన్నారు. రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నడ్డా బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికైన‌ప్పుడు ఎవరికీ తెలియద‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయ‌ని తెలిపారు. బలమైన ప్రతిపక్షాన్ని ఇచ్చే స్థితిలో కాంగ్రెస్ ఇంకా ఉందని ఈ ఎన్నికలు దేశ ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయ‌ని గెహ్లాట్ ధీమా వ్య‌క్తం చేశారు. 

click me!