కర్ణాటకలో మంత్రుల బంధువులకు కాంగ్రెస్ టికెట్లు.. సిద్ధరామయ్య ఏమన్నారంటే ?

By Sairam Indur  |  First Published Mar 24, 2024, 7:49 PM IST

తాము వారసత్వ రాజకీయాలు చేయడం లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ప్రజలు కోరుకున్న వారినే తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించామని చెప్పారు.


మంత్రుల పిల్లలు, బంధువులకు టికెట్లు ఇవ్వడం వారసత్వ రాజకీయాలు కాదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులకు సంబంధించిన నాలుగో జాబితాను శనివారం విడుదల చేసింది. అలాగే మార్చి 21వ తేదీన కూడా ఓ జాబితాను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి, కర్ణాటకలోని ఐదుగురు మంత్రుల పిల్లల పేర్లు ఉన్నాయి.

మరో 45 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ప్రధానిపై మోడీపై పోటీ చేసేదెవరంటే ?

Latest Videos

దీనిపై సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘‘అవును మేం ఇచ్చాం. నియోజకవర్గ ప్రజలు సిఫారసు చేసిన వారికే టికెట్లు ఇచ్చాం. ఇది వారసత్వ రాజకీయాలు కాదు.. ప్రజల అభిప్రాయాన్ని అంగీకరించడం’’ అని అన్నారు. తమ ప్రభుత్వం అమలు చేసిన ఐదు హామీలు ఎన్నికల్లో పార్టీ విజయానికి దోహదం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

కేజ్రీవాల్ అరెస్ట్.. 31న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి నిరసన

‘‘ఈ ఏడాది రూ.36 వేల కోట్లు ఖర్చు చేశాం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.52,900 కోట్లు కేటాయిస్తాం. మేం బీజేపీలా అబద్ధాలు చెప్పం. మేం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం’’ అని ఖర్గే అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 600 హామీలు ఇచ్చిందని, కానీ వాటిలో 10 శాతం కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.

చంద్రయాన్ -3 ల్యాండింగ్ సైట్ ఇక అధికారికంగా ‘శివ శక్తి’

‘‘ప్రధాని నరేంద్ర మోడీ మీకు రూ.15 లక్షలు ఇచ్చారా? రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి 'అచ్ఛే దిన్' తెచ్చారు. ప్రజలు ఆయనను ఎందుకు నమ్ముతారు’’ అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కాగా.. మొత్తం 28 లోక్ సభ స్థానాలున్న కర్ణాటకలో ఏప్రిల్ 26, మే 7వ తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

click me!