2023 ఆగస్టు 23వ తేదీన చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ -3 కాలు మోపింది. ఈ ప్రదేశాన్ని శివ శక్తి పాయింట్ గా పిలవాలని ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అయితే ఆ పేరును అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య అధికారికంగా తాజాగా ఆమోదించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక చంద్రయాన్ -3 మిషన్ లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన ప్రదేశాన్ని ఇక నుంచి అధికారికంగా ‘శివ శక్తి’ అని పిలవనున్నారు. పారిస్ లోని అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (ఐఏయూ) ఆ పేరును అధికారికంగా ఆమోదించింది. ల్యాండింగ్ సైట్ కు 'శివశక్తి' అని పేరు పెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన దాదాపు ఏడు నెలల తర్వాత ఈ ఆమోదం లభించింది.
ఖగోళ సంస్థ ఆమోదించిన గ్రహాల పేర్ల గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించే గెజిటీయర్ ఆఫ్ ప్లానెటరీ నామకరణం ప్రకారం.. చంద్రయాన్ -3 ల్యాండింగ్ సైట్ కోసం ‘‘స్టాటియో శివ శక్తి’’ అనే పేరును మార్చి 19న ఐఏయూ ఆమోదించింది. ‘‘చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ సైట్ పేరు.. ప్రకృతి పురుష (శివ), స్త్రీ (శక్తి) ద్వంద్వత్వాన్ని వర్ణించే భారతీయ పురాణాల నుండి సమ్మేళన పదం’’ అని పేర్కొంది.
“Shakti" Rahul KHAN-Gandhi wants to fight with, gets approval from International Astronomical Union, with power added by “Shiv"!
Chandrayaan-3 landing site named 'Shiva Shakti' by . Ji on 26 Aug 2023, got IAU nod on 19 March.
World acknowledges “Shiv-Shakti" which… pic.twitter.com/N146YQN2Yh
undefined
చంద్రయాన్-3 చంద్రుడిపై దిగిన ఆగస్టు 23ను ఇకపై 'జాతీయ అంతరిక్ష దినోత్సవం'గా పిలుస్తామని 2023 ఆగస్టు 26న బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ లో ప్రధాని మోడీ ప్రకటించారు. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ -2 పాదముద్రలు వదిలిన ప్రదేశాన్ని 'తిరంగా' అని పిలుస్తామని, ఇది భారతదేశం చేసిన ప్రతి ప్రయత్నానికి ప్రేరణ అని ప్రధాని ఆ సమయంలో అన్నారు. ఏదైనా వైఫల్యం అంతిమమైనది కాదని ఇది మనకు గుర్తు చేస్తుందని చెప్పారు.
కాగా.. 2023 ఆగస్టు 23న చంద్రయాన్-3 మిషన్ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధృవానికి దగ్గరగా చేరుకున్న మొదటి దేశంగా, చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి నాలుగు దేశాలలో ఒకటిగా భారత్ నిలిచింది. చంద్రయాన్-3 ప్రయోగంతో ఇస్రో సాధించిన విజయాలకుగాను గతవారం ప్రతిష్టాత్మక ఏవియేషన్ వీక్ అవార్డుతో సత్కరించింది.