Assembly Elections2022: దేశంలో త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు మినీ ఎలక్షన్ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. యూపీలో ఎన్నికల వేడి మాములుగా లేదు. అన్ని పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. యూపీలో జరిగే అన్ని ర్యాలీలను రద్దు చేసుకుంది.
Assembly Elections2022: దేశంలో త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు మినీ ఎలక్షన్ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. యూపీలో ఎన్నికల వేడి మాములుగా లేదు. అన్ని పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. యూపీలో జరిగే అన్ని ర్యాలీలను రద్దు చేసుకుంది. ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతున్న కొనసాగుతున్న తరుణంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. దీని ప్రధాన కారణం ఉత్తరప్రదేశ్ లోని రాయ్‌బరేలీలో చోటుచేసుకున్న ఘటనే కారణంగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీ రాయ్ బరేలీలో నిర్వహించిన మారథాన్‌లో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. అయితే, ఇందులో పెద్దగా ఎవరికీ గాయాలు కాలేదు. కానీ కొద్దిగా పరిస్థితి చేయిదాటిన చాలా మంది తీవ్రంగా గాయపడే పరిస్థితులు చోటుచేసుకునేవని సంబంధిత వీడియో దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది.
Also Read: Caste: పాఠశాలలో కుల విభజన.. ఏపీలో ఘటన... సర్వత్రా ఆగ్రహం
undefined
రాయ్ బరేలీలో "లడ్కీ హన్, లాడ్ శక్తి హన్ (మహిళలు పోరాడగలరు)" ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నిర్వహించిన మారథాన్‌లో వందలాది మంది మహిళలు, యువతులు, బాలికలు పాల్గొన్నారు. వీరిలో చాలా మంది మాస్కులు లేకుండా కూడా కనిపంచారు. అయితే, ర్యాలీ ముగుస్తున్న సమయంలో మారథాన్‌లో పాల్గొనేవారు భారీ గుంపు రావడంతో దగ్గరగా అయ్యారు. ఈ క్రమంలో తొక్కిసలాగ చోటుచేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. చివర్లో పలువురు కిందపడ్డారు. కానీ వారిని అక్కడున్న వారు వెంటనే ముందుకు లాగడంతో ప్రమాదం తప్పింది. కోవిడ్ విజృంభంణ నేపథ్యంలో ర్యాలీలో పాల్గొన్న వారు మాస్కులు ధరించకపోవంపై విమర్శలు వస్తున్నాయి. బీజేపీ, సమాజ్‌వాదీ, సహా రాష్ట్రంలోని ఇతర పార్టీలు ఇదే విషయాన్ని ఎత్తిచూపుతూ కాంగ్రెస్ పై విమర్శల దాడి కొనసాగిస్తున్నాయి. వేల మంది ప్రాణాలను పణంగా పెడుతున్నదని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: Coronavirus: డెల్టా మాదిరిగానే ఒమిక్రాన్ పంజా.. జనవరిలోనే పీక్ స్టేజ్ !.. ఆంక్షలు ఆపలేవు !
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కొత్త కేసులు క్రమంగా పెరగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు నోయిడాలో జరగాల్సిన ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ వాయిదా వేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ ర్యాలీలో పాల్గొనాల్సి ఉండగా, ఆయన దానిని రద్దు చేసుకున్నారు. అయితే, కాంగ్రెస్ తీసుకున్ననిర్ణయంపై సానుకూలత వ్యక్తమవుతున్నది. ఎందుకంటే ప్రస్తుతం కరోనా పంజా విసురుతున్న సమయంలో ర్యాలీలు నిర్వహించడం.. బహిరంగ సమావేశాల కారణంగా పెద్ద మొత్తంలో ప్రజలు గుమిగూడుతారు. కోవిడ్ భద్రతా ప్రోటోకాల్‌లను నిర్వహించడం కష్టంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో రాజకీయ ర్యాలీలు వద్దనే దానిపై చర్చ నడుస్తోంది. ఇక కాంగ్రెస్ నిర్ణయం నేపథ్యంలో బీజేపీ సైతం ఆదే దారిలో నడవనుందా అనేది అస్ఫష్టంగా ఉంది. దీనికి తోడు దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇదివరకు కరనా సమయంలోనే ఎన్నికలు నిర్వహించడం వల్ల కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార ర్యాలీల కారణంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
Also Read: Coronavirus: కోవిడ్ నిధుల వినియోగంలో వెనుకబడ్డ ఈశాన్య రాష్ట్రాలు.. టాప్‌లో ఢిల్లీ, తమిళనాడు