బొగ్గు కుంభకోణం: మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రాయ్ దోషిగా తేల్చిన కోర్టు

By narsimha lodeFirst Published Oct 6, 2020, 1:18 PM IST
Highlights

మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రాయ్ ను బొగ్గు కుంభకోణంలో  ప్రత్యేక కోర్టు మంగళవారం నాడు దోషిగా తేల్చింది.1999 లో జార్ఖండ్ బొగ్గు బ్లాకును కేటాయించడంలో అవకతవకలకు సంబంధించి బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రాయ్ ను ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.


న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రాయ్ ను బొగ్గు కుంభకోణంలో  ప్రత్యేక కోర్టు మంగళవారం నాడు దోషిగా తేల్చింది.1999 లో జార్ఖండ్ బొగ్గు బ్లాకును కేటాయించడంలో అవకతవకలకు సంబంధించి బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రాయ్ ను ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.

వాజ్‌పేయ్ మంత్రివర్గంలో రాయ్ బొగ్గు శాఖ మంత్రిగా పనిచేశారు. క్రిమినల్ కుట్ర, ఇతర నేరాలకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి భారత్ పరాషర్ దోషిగా నిర్ధారించారు.

మాజీ కేంద్ర మంత్రితో పాటు సీటీఎల్ కు చెందిన సీనియర్ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతం, సీఎంఎల్ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్ లను కూడ దోషులుగా కోర్టు నిర్ధారించింది.

జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదిహ్‌లోని బ్రహ్మాదిహ బొగ్గు బ్లాక్ ను 1999 లో సిటిఎల్ కు కేటాయించడంపై కేసు నమోదైంది. ఈ కేసుపై ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత ప్రత్యేక కోర్టు ఇవాళ మాజీ కేంద్ర మంత్రిని దోషిగా తేల్చారు. 

click me!