CM Jagan: నేడు ఢిల్లీకి జగన్.. మోడీ, అమిత్ షాలతో భేటీ!

By Mahesh KFirst Published Mar 4, 2024, 4:30 AM IST
Highlights

సీఎం జగన్ నేడు ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.ఈ పర్యటనలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లను కూడా ఆయన కలిసే అవకాశాలు ఉన్నాయి.
 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు (మార్చి 4) ఢిల్లీకి వెళ్లుతున్నారు. ఆయన హస్తినలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ ఆయన భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. 

ఈ పర్యటనలో ఆయన విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సీఎం జగన్ కేంద్రాన్ని అడిగే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం చివరి క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ నెల 6వ, 7వ తేదీల్లో చివరి మంత్రివర్గ భేటీ జరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వెంటనే అమల్లోకి తెచ్చే నిర్ణయాలనూ ఈ భేటీలో తీసుకునే అవకాశం ఉన్నదని రాజకీయవర్గాలు తెలిపాయి.

Also Read: YSR Congress Party: ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలకు వైసీపీ మంత్రుల కౌంటర్

ప్రతిపక్ష కూటమి ఇంకా ఖరారు కాకపోవడం, టీడీపీ, జనసేనల కూటమిపై బీజేపీ ఇంకా సైలెంట్‌గా ఉండటం సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నది. ఇటీవలే చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత సీఎం జగన్ వెళ్లడం.. అక్కడ కేంద్ర ప్రభుత్వం పెద్దలతో భేటీ కావడం చర్చనీయాంశం అయింది. బీజేపీని తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది.

ఇప్పుడు ప్రతిపక్ష కూటమిని బీజేపీ పెండింగ్‌లో పెట్టిన నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. వైసీపీ మాత్రం ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్లుతుందని ఇది వరకే సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

click me!