ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్ కేసులో చిత్రా రామకృష్ణ, ఆనంద్ సుబ్రమణ్యంలకు బెయిల్

By team teluguFirst Published Sep 28, 2022, 1:43 PM IST
Highlights

ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్రా రామకృష్ణ, ఆనంద్ సుబ్రమణ్యంకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ స్కామ్ మొదటి సారిగా 2018లో వెలుగులోకి వచ్చింది. 

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కో-లొకేషన్ స్కామ్‌లో విచారణ ఎదుర్కొంటున్న ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణకు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈ కేసులో రెండో నిందితుడు ఆనంద్ సుబ్రమణ్యంకు కూడా బెయిల్ లభించింది. సుబ్రమణ్యం గతంలో ఎన్‌ఎస్‌ఈకి గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన చిత్రా రామకృష్ణకు ఆయన సలహాదారుగా కూడా ఉన్నారు.

ఢిల్లీకి చేరుకున్న రాజస్థాన్ సీఎం : సోనియాతో భేటీ కానున్న ఆశోక్ గెహ్లాట్

దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీలో జరిగిన కుంభకోణంపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంపై 2018లో మొదటిసారిగా కేసు నమోదైంది. కాగా చిత్రా రామకృష్ణను ఈ ఏడాది మార్చి 6వ తేదీన అరెస్టు చేశారు. అయితే అంతకు ముందు ట్రయల్ కోర్టు ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అదే సమయంలో ఫిబ్రవరి 24వ తేదీన ఆనంద్ సుబ్రమణ్యంను కూడా అరెస్టు చేశారు.

దేశం చెక్కు చెద‌ర‌కూడ‌దంటే పీఎఫ్‌ఐపై నిషేధం ఉండాల్సిందే- బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్

కో-లొకేషన్ స్కామ్ కేసులో 2018 సంవత్సరంలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. NSE కో -లోకేషన్ సర్వీసును కలిగి ఉంది. దీని కింద బ్రోకరేజ్ సంస్థలు తమ సర్వర్‌లను NSE క్యాంపస్‌లో ఉంచడానికి యాక్సెస్ ఉంటుంది. దీని వ‌ల్ల వారు మార్కెట్ అప్ డేట్ ల‌ను వేగంగా పొందుతారు. కానీ కొందరు బ్రోకర్లు ఈ సర్వీస్‌ను ట్యాంపరింగ్ చేసి కోట్లలో లాభాలు ఆర్జించినట్లు విచారణలో తేలింది. అల్గారిథమిక్ ట్రేడింగ్‌ను మెరుగుపరచడానికి ఎన్‌ఎస్ఈ కొంతమంది వ్యాపారులకు, బ్రోకర్లకు చట్టవిరుద్ధంగా యాక్సెస్ ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి చిత్రా రామకృష్ణ, ఆనంద్ సుబ్రమణ్యంలను సీబీఐ ప్రశ్నించింది.

దొంగబాబాల మాట నమ్మి.. సజీవసమాధిలోకి వెళ్లిన యువకుడు.. పోలీసులు రావడంతో..

కొంత కాలం తర్వాత ఎన్‌ఎస్‌ఈలో కార్పొరేట్ గవర్నెన్స్‌లో అనేక లోపాలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఎన్‌ఎస్‌ఈ అత్యున్నత పదవిలో కూర్చొని తన పదవిని, హక్కులను దుర్వినియోగం చేస్తోందని రామకృష్ణపై ఆరోపణలు వచ్చాయి. బోర్డ్ ఆఫ్ స్టాక్ ఎక్స్ఛేంజ్, ఎన్ఆర్సీ అనుమతి లేకుండా ఆనంద్ సుబ్రమణ్యం నియామకం, పదోన్నతి పొందిన‌ట్టు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 
 

click me!