
యూపీలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. పక్కా ప్రణాళిక ప్రకారం.. ఓ ఇంట్లో చొరబడి డబ్బు, నగదు కాజేశారు. అడ్డువచ్చిన వారిని అత్యంత దారుణంగా మార్చారు. హత్య చేసిన తీరును చూసి పోలీసులు సైతం విస్తుపోతున్నారు. నిందితుడు పోలీసులకు చిక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
యూపీలోని మీరట్ లో ఇటీవల ఓ వ్యాపారి, అతని భార్యను హత్య చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. 2020లో విడుదలైన 'అసుర్' వెబ్ సిరీస్ నుంచి స్ఫూర్తి పొంది ఈ నేరానికి పాల్పడ్డామని నిందితులు తెలిపారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ సింగ్ సజ్వాన్ తెలిపారు.
మీరట్ లోని బ్రహ్మపురి ప్రాంతంలో ధన్ కుమార్ జైన్ (70), అంజు జైన్ (65) దంపతులు నివాస్తున్నారు.
గురువారం అర్థరాత్రి సమయంలో ఇద్దరు దుండగులు వారి ఇంట్లోకి చొరబడిన దోపిడీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ దంపతులకు, దుండగులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో అంజు జైన్ (65) తీవ్రంగా గాయపడ్డారని సజ్వాన్ తెలిపారు. అనంతరం దుండగులిద్దరూ నగదు, నగలతో పరారయ్యారని తెలిపారు. అయితే.. చికిత్స పొందుతూ అంజు శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
కేసును ఛేదించేందుకు ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశామని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, ఎలక్ట్రానిక్ నిఘా నిర్వహించి, ఇన్‌ఫార్మర్ల నుంచి ఇన్‌పుట్‌లను సేకరించామని, ఆ తర్వాత ఇద్దరు నిందితులను పట్టుకున్నామని ఎస్‌ఎస్పీ తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులను ఎల్‌ఎల్‌బి చివరి సంవత్సరం చదువుతున్న ప్రియాంక్ శర్మ (25) అలియాస్ పరుష్, అతని స్నేహితుడు యశ్ శర్మ అలియాస్ యషు (24)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
విచారణ సమయంలో ప్రధాన నిందితుడు ప్రియాంక్ 'అసుర్' వెబ్ సిరీస్ నుండి ప్రేరణ పొందినట్టు, పోలీసుల నుండి తప్పించుకోవడానికి యూట్యూబ్‌లో మార్గాలను వెతుకుతున్నట్లు పోలీసులకు చెప్పాడు, SSP చెప్పారు. నిందితులు తమ గుర్తింపును దాచడానికి చేతి తొడుగులు, మాస్క్‌లు , హెల్మెట్‌లను ఉపయోగించారని, బైక్ నంబర్ ప్లేట్‌ను కూడా మార్చారని ఎస్‌ఎస్‌పి తెలిపారు. సీసీటీవీ కెమెరాలు గుర్తించలేని చోట వీరిద్దరూ తప్పించుకునే మార్గాన్ని ఎంచుకున్నారని పోలీసులు తెలిపారు.
పక్కప్రణాళిక ప్రకారం.. ఈ దారుణానికి పాల్పడానికి ముందు రోజు.. నిందితులు గది అద్దె కు కావాలనే సాకుతో వ్యాపారవేత్త ఇంటికి వెళ్లినట్లు వారు తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలతో పాటు, నేరానికి పాల్పడిన సమయంలో ఉపయోగించిన పిస్టల్, మోటార్ సైకిల్, బట్టలు, హెల్మెట్‌లు, షూలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఎస్పీ తెలిపారు.