పరీక్షలో తనను పాస్ చేయించాలని ఓ విద్యార్ధిని కోరింది. తాను ఫెయిలైతే పెళ్లి చేస్తారని ఆ విద్యార్ధిని కోరింది.
న్యూఢిల్లీ: పరీక్షల్లో పాస్ చేయకపోతే తనకు పెళ్లి చేస్తారని.. తనను పాస్ చేయాలని ఓ విద్యార్థిని ఆన్సర్ షీట్ లో కోరింది. ఇందుకు సంబంధించిన కథనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read:టీడీపీ-బీజేపీ-జనసేన సీట్ల షేరింగ్‌లో స్వల్పమార్పులు: ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ కు చెందిన ఓ విద్యార్ధిని ఇంగ్లీష్ పరీక్షలో పాస్ చేయాలని ఆన్సర్ షీట్ లో రాసింది. ఈ పరీక్షల్లో ఫెయిలైతే తనకు తన పేరేంట్స్ బలవంతంగా వివాహం చేస్తారని ఆ విద్యార్ధిని రాసింది. తనను ఇంగ్లీష్ పరీక్షలో పాస్ చేయాలని అభ్యర్థించింది. ఇంగ్లీష్ పరీక్షలో తనను పాస్ చేయాలని కోరింది.
గతంలో కూడ కొందరు విద్యార్థులు సినిమా పాటలను, సినిమా స్టోరీలను రాసిన ఉదంతాలు కూడ వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన విషయమై సోషల్ మీడియాలో చేసిన పోస్టులు వైరల్ గా మారాయి.
also read:చంద్రబాబు నివాసానికి బీజేపీ,జనసేన నేతలు: సీట్ల సర్ధుబాటుపై కీలక చర్చలు
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి.ఈ పరీక్ష్లల్లో ఉత్తీర్ణులయ్యేందుకు విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే కొందరు విద్యార్థులు మాత్రం పరీక్షలను గట్టెక్కేందుకు కొత్త పద్దతులను ఆలోచిస్తున్నారు. తమ పరిస్థితిని వివరించి పాస్ చేయాలని కోరుతున్నారు. ఈ తరహా ఘటనలు సినిమాల్లో చూస్తుంటాం.మధ్యప్రదేశ్ విద్యార్ధిని కూడ ఇదే పద్దతిని అవలంభించిందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. చిన్నతనంలో తాము ఎలా వ్యవహరించిన తీరును కొందరు నెటిజన్లు గుర్తు చేసుకున్నారు.
also read:రైలులో సీటు కోసం గొడవ: వ్యక్తిని నిలదీసిన మహిళలు, నెట్టింట వైరల్
అయితే విద్యార్ధుల్లో సబ్జెక్టుపై అవగాహన కంటే మార్కులపై శ్రద్ద పెట్టే పరిస్థితి ప్రస్తుతం నెలకొందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.