సంఘ్‌‌ను నక్సల్స్‌తో పోల్చిన సీఎం.. ‘వీరి నేతలు నాగ్‌పూర్‌లో వారి నేతలు తెలంగాణ, ఆంధ్రలో.. ’

By telugu teamFirst Published Oct 13, 2021, 7:51 PM IST
Highlights

నక్సల్ నేతలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉన్నారని, సంఘ్ నేతలు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్నారని, ఇవి రెండు రాష్ట్రంలో చట్టబద్ధ పాలనకు విఘాతం కలిగిస్తున్నాయని చత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ బఘేల్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సమస్యలేవీ లేవని, అందుకే సంఘ్ కార్యకర్తలు అల్లర్లకు తెగబడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని సంఘ్ కార్యకర్తలు నాగ్‌పూర్ నేతలకు కట్టుబానిసలయ్యారని విమర్శలు గుప్పించారు.
 

రాయ్‌‌పూర్: చత్తీస్‌గడ్ CM Bhupesh Baghel భుపేశ్ బఘేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. sangh కార్యకర్తలు, naxalsను పోల్చి సరికొత్త వివాదానికి తెరతీశారు. రాష్ట్రంలో చట్టపాలనకు వీరు విఘాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. nagpurలో నాయకత్వం కూర్చుంటే.. వారి ఆజ్ఞానుసారాల మేరకు ఇక్కడ సంఘ్ కార్యకర్తలు పనిచేస్తున్నారని, telangana, andhra pradeshలలో మావోయిస్టు నేతలు ఉంటే వారి ఆదేశాలను ఇక్కడ నక్సల్స్ పాటిస్తున్నారని ఆరోపణలు చేశారు. సీఎం వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. ఆయన తీవ్రవాద భాష మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.

కబీర్‌దామ్ జిల్లాలోని కావర్దలో గతవారం ఘర్షణలు చోటుచేసుకున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ అనుసూయి ఉయికే లేఖ రాశారు. ఈ లేఖకు సమాధానమిస్తూ సీఎం భుపేశ్ బఘేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిష్పక్షపాత దర్యాప్తు జరుగుతుందని హామీనిచ్చారు. గత 15ఏళ్లుగా చత్తీస్‌గడ్‌లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు(బీజేపీ ప్రభుత్వం) ఏమీ చేయలేదని, ఇక్కడి సంఘ్ కార్యకర్తలు కేవలం నాగ్‌పూర్ నేతలకు వెట్టిచాకిరి చేసేవారిలా మారిపోయారని అన్నారు. రాష్ట్రంలోని సంఘ్ కార్యకర్తలను నాగ్‌పూర్ నాయకత్వం నడిపిస్తున్నదని తెలిపారు. నక్సల్స్ నేతలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంటే.. నక్సలిజం ఇక్కడ ఉన్నట్టు.. సంఘ్ కూడా అలాగే ఉన్నదని చెప్పారు.

Also Read: సావర్కర్‌పై రచ్చ.. బీజేపీ ఆయనను జాతిపితగా ప్రకటిస్తుంది.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఒవైసీ మండిపాటు

bjp నేతలు రాష్ట్రంలో ఏ సమస్య కనిపించడం లేదని, అందుకే ఘర్షణలు, అల్లర్లకు తెగబడుతున్నారని సీఎం భుపేశ్ బఘేల్ అన్నారు. వారు ప్రజల మధ్య ఘర్షణలు పెడుతున్నారని చెప్పారు. మొన్నటి వరకు కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ నిలిచిపోయిందని, ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటుంటే దాన్ని అడ్డుకుంటున్నారని తెలిపారు. ప్రతి చిన్న విషయానికి మతం రంగు పులుముతున్నారని, ఈ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. మత మార్పిడిలు, మత హింస చేయడంలో వారు నిష్ణాతులని ఆరోపణలు గుప్పించారు.

దేశంలో బొగ్గు సంక్షోభం లేదంటున్న కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అప్పుడు ఆక్సిజన్ లేకున్నా.. ఉన్నదన్నారు.. ఎరువులు లేకున్నా ఉన్నాయన్నా.. ఇప్పుడు బొగ్గు కొరత ఉన్నా.. లేదని అబద్ధాలు ఆడుతున్నదన్నదని ఆగ్రహించారు. బొగ్గు కొరత లేనిదే బొగ్గు శాఖ మంత్రి చత్తీస్‌గడ్‌కు ఎందుకు వచ్చారని నిలదీశారు. దేశంలో బొగ్గు సంక్షోభం లేకుంటే.. విద్యుత్ ఉత్పత్తి తగ్గకుంటే డజన్ పవర్ ప్లాంట్‌లు ఎందుకు మూసి ఉన్నాయని అడిగారు.

click me!