‘పీఎం గతిశక్తి’ ప్రాజెక్టు ప్రారంభించిన ప్రధాని.. 21వ శతాబ్ది భారతావని నిర్మాణానికి దోహదం

By telugu teamFirst Published Oct 13, 2021, 5:58 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పీఎం గతిశక్తి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో నాణ్యమైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. లాజిస్టికల్ ఖర్చును తగ్గించడంతోపాటు సరఫరా సమయాన్నీ తగ్గించబోతున్నట్టు తెలిపారు.
 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ‘పీఎం గతిశక్తి’ ప్రాజెక్టును ప్రారంభించారు. భారత ప్రజలు, పరిశ్రమలు, వ్యాపార సమాజం, తయారీదారులు, రైతులు ఈ ప్రాజెక్టు లక్ష్యాల్లో ప్రధానంగా ఉన్నారని Prime Minister Narendra Modi వివరించారు. ఈ PM Gati Shakti project ప్రస్తుత, భావి తరాలకు సరికొత్త శక్తిని ఇస్తుందని తెలిపారు. తద్వార 21వ శతాబ్దపు దేశంగా నిర్మితం కావడానికి పీఎం గతిశక్తి ప్రాజెక్టు కీలకంగా దోహపడుతుందని వివరించారు.

పీఎం గతిశక్తి నేషనల్ master plan మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్టును ఆయన ప్రారంభిస్తూ ప్రభుత్వ పనులంటేనే ఆలస్యం లేదా వాయిదాలు అనే మాట జ్ఞప్తికి వస్తుందని ప్రధాని తెలిపారు. ఇన్నాళ్లు భారత పౌరుల పన్నులకు న్యాయం జరగలేదని, వారికి  సమర్థవంతమైన సేవలు అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులపై పౌరులు అసంతృప్తితో ఉన్నారని, ఇవాళ్టి నుంచి సంకల్పం, ప్రాధాన్యతలు కొత్త అభివృద్ధి మంత్రమని తెలిపారు. ఇన్నాళ్లు ‘నడుస్తది’ అనే సంస్కృతి కొనసాగుతున్నదని అన్నారు. వర్క్ ఇన్ ప్రొగ్రెస్ అనే ట్యాగ్‌ను మార్చుతున్నామని చెప్పారు. ఇలాంటి సంకేతాలన్నీ ఇప్పుడు పనికి రానివని స్పష్టమయ్యాయని వివరించారు.

గతంలో పరిశ్రమల కోసం ప్రత్యేక జోన్‌లు ప్రకటించేవారని, కానీ, రవాణా సదుపాయాలు, విద్యుత్, టెలికాం, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రభుత్వాలు అంత సీరియస్‌గా ఉండేవి కావని ప్రధాని అన్నారు. కానీ, గతిశక్తి ప్రాజెక్ట్ ఈ చిత్రాన్ని మారుస్తుందని వివరించారు. మౌలిక వసతులు లేక డబ్బు, సమయాన్ని వృథా కానివ్వబోమని తెలిపారు. ఈ ప్రాజెక్టు అన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్‌లను ఒకే వేదికపైకి తెస్తుందని, అభివృద్ధి ప్రాజెక్టులపై అన్నీ సమన్వయంతో కలిసి సేవలను అందిస్తాయని వివరించారు. రోడ్డు నుంచి రైల్వే వరకు, ఏవియేషన్ నుంచి రైతుల వరకు ప్రతి ఒక్క సేవలను ఈ గతిశక్తి సమన్వయం చేస్తుందని తెలిపారు.

Also Read: ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదానికి నిలయంగా మారకుండా చూడాల్సిన బాధ్యత మనదే.. జీ20 సమ్మిట్ లో మోడీ...

ఇది భారత్‌లో పెట్టుబడులు పుంజుకోవడానికి దోహదపడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. భారత జీడీపీలో కేవలం లాజిస్టికల్ ఖర్చులు 13శాతంగా ఉన్నాయని ఈ సందర్భంగా వివరించారు. ఇది ఎగుమతులపై ప్రభావం వేస్తున్నదని తెలిపారు. గతిశక్తి ప్రాజెక్టు ఈ పరిస్థితులను మారుస్తుందని, లాజిస్టిక్ ఖర్చుల, సమయాభావాన్ని తగ్గిస్తుందని చెప్పారు. 

70ఏళ్ల భారత పాలనలో ఇంతటి వేగవంతమైన అభివృద్ధి ప్రణాళికలు, సంస్కరణలు ఇప్పటి వరకు చోటుచేసుకోలేదని, తమ ప్రభుత్వం వేగంగా చర్య లు తీసుకుంటున్నదని ప్రధాని మోడీ అన్నారు. ఇందుకో ఉదాహరణనూ ఇచ్చారు. మనదేశంలో 1987లో గ్యాస్  పైప్‌లైన్‌ను ప్రారంభించారని, అప్పటి నుంచి 2014 వరకు 15వేల కిలోమీటర్ల సహాజ వాయువు పైప్‌లైన్‌ను నిర్మించారని వివరించారు. ఇప్పుడు 16వేల కొత్త గ్యాస్ పైప్‌లైన్‌లు నిర్మాణమవుతున్నాయని తెలిపారు. గత 27ఏళ్లలో చేసిన పనిని సగం కాలంలోనే పూర్తి చేస్తున్నామని చెప్పారు. గతిశక్తి మాస్టర్ ప్లాన్ మరో 25ఏళ్ల వరకు దేశ ఆత్మ నిర్భరతకు మార్గం సుగమం చేస్తుందని వివరించారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన గతి శక్తి ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

click me!