
కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan singh) బుధవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యలు ఆయనను ఢిల్లీలోని (Delhhi ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం మన్మోహన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రెండ్రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది కొవిడ్ రెండో వేవ్ సమయంలో మన్మోహన్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దాంతో అప్పట్లో ఆయన ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.