వాడిపోయిన కమలం.. ఛత్తీస్‌గఢ్ 'హస్త'గతం

చత్తీస్ ఘడ్  లోని 90 అసెంబ్లీ స్థానాలకు ఇటీవలే రెండు విడతల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. * ఈ ఎన్నికల్లో చత్తీస్ ఘడ్ ఓటర్లు వైవిధ్యమైన తీర్పు ఇవ్వనున్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఏ పార్టీకి స్పస్టమైన మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని సర్వేలన్ని వెల్లడించాయి. దీంతో ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ  నెలకొంది. 

5:47 PM

ఓటమిని అంగీకరిస్తున్నా...గవర్నర్ ని కలిసి రాజీనామా లేఖ అందిస్తా: రమణ్ సింగ్

చత్తీస్ గడ్ ముక్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు రమణ్ సింగ్ ప్రకటించారు. బిజెపి పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు.తన సారథ్యంలో ఎన్నికలకు వెళ్లాము కాబట్టి ఈ ఓటమికి తానే భాద్యత వహిస్తానన్నారు. ప్రజల కోరిక మేరకు తాము ప్రతిపక్షంలో కొనసాగనున్నట్లు తెలిపారు. గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను అందిస్తానని రమణ్ సింగ్ వెల్లడించారు. 
  
5:34 PM

ఈ విజయాన్ని తాము ఊహించలేదు: భూపేష్ భాఘెల్

చత్తీస్ గడ్ లో కాంగ్రెస్ పార్టీని విజయం వరిస్తుందని ముందుగానే తెలుసని...కానీ ఇంత భారీ విజయాన్ని ఊహించలేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు భూపేష్ భాఘెల్ ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వెలుడిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ 64 స్థానాల్లో లీడ్ లో ఉంది.  అధికార బిజెపి పార్టీ మాత్రం కేవలం 14 స్థానాలకే పరిమితమైంది. 

5:04 PM

సీఎంగా ఓడినా వ్యక్తిగతంగా గెలిచేలా కనిపిస్తున్న రమణ్ సింగ్

చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఎట్టకేలకు లీడింగ్ సాధించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో కమలం పార్టీ చిత్తుగా ఓడిపోయే స్థితిలో ఉంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా కొన్ని రౌండ్లలో వెనుకంజలో ఉండగా...తాజాగా ఆయన 3 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలోకి వెళ్లారు. దీంతో వ్యక్తిగతంగా ఘోర పరాభవం నుండి రమణ్ సింగ్ తప్పించుకున్నా...ముఖ్యమంత్రిగా మాత్రం ఓటమిపాలయ్యారు.    
 
4:24 PM

రమణ్‌సింగ్ ఓటమికి కారణాలివే

ఛత్తీస్‌గఢ్‌ను బీజేపీకి కంచుకోటగా మార్చిన రమణ్ సింగ్‌కు నాలుగోసారి ఓటమి ఎదురైంది. ఇవాళ విడుదలైన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 90 స్థానాలకు గాను.. కాంగ్రెస్ 66, బీజేపీ 14, బీఎస్పీ-జేసీసీ 9, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు.

ఈ ఓటమితో ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ 15 ఏళ్ల పాలనకు చెక్ పడనుంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం డిసెంబర్ 7న సీఎంగా బాధ్యతలు చేపట్టిన రమణ్‌సింగ్ ఏకధాటిగా ఏలారు. నాలుగోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ చెప్పినప్పటికీ.. వాటని తారుమారు చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

ముఖ్యంగా రమణ్‌సింగ్‌పై తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉంది. ప్రజాకర్షక పథకాలతో పాటు నిరుపేదలకు చవక బియ్యం అందిస్తూ (చావల్ బాబా)గా పేరు సంపాదించుకున్నప్పటికీ.. రమణ్ సింగ్ ప్రజాగ్రహానికి గురయ్యారు. బంధుప్రితీ, అవనీతి ఆరోపణలకు తోడు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు, వెనుకబడిన వర్గాల వారి ఓటు కాంగ్రెస్ వైపు వెళ్లినట్లు రాజకీయ వర్గాలు అంచనాకు వస్తున్నారు.

సుధీర్ఘకాలం బీజేపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన బీజేపీ నేతగా నరేంద్రమోడీ పేరిట ఉన్న రికార్డును రమణ్‌సింగ్ బద్ధలు కొట్టారు. ప్రస్తుత ప్రధాని మోడీ గుజరాత్ సీఎంగా ఏకధాటికి 4,610 రోజులు ఉన్నారు. ఆ రికార్డును రమణ్‌సింగ్‌ బద్ధలుకొట్టారు. ఈ ఏడాది ఆగస్టుతో ఆయన ముఖ్యమంత్రిగా 5 వేల రోజులు పూర్తి చేసుకున్నారు. 

4:10 PM

బీజేపీ ఓడిపోయింది అంతే చాలు: అజిత్ జోగి

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలపై జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే) చీఫ్, మాజీ సీఎం అజిత్ జోగి స్పందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం తామేనని భావించి ప్రజలు తమ పార్టీకి మద్ధతుగా నిలిచారని జోగి పేర్కొన్నారు.

దాదాపు 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు బలంగా కోరుకున్నారని జోగి వ్యాఖ్యానించారు. వేరు కుంపటి పెట్టే వరకు అజిత్ జోగి కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారు.

తాజా ఎన్నికలు తాము రాష్ట్రంలో థర్డ్ ఫ్రంట్‌గా ఏర్పడేందుకు తోడ్పడుతున్నాయన్నారు. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 68, బీజేపీ 12, బీఎస్పీ-జేసీసీ 9, ఇతరులు 1 చోట గెలుపొందారు. 

2:38 PM

బోసిపోయిన చత్తీస్‌గడ్ బిజెపి కార్యాలయం

బిజెపి ఓటమి ఖాయమవడంతో చత్తీస్ గడ్ రాజధాని రాయ్ పూర్ లోని బిజెపి కార్యాలయం నాయకులు, కార్యకర్తల సందడి లేక బోసిపోతోంది. 

ప్రస్తుతం అక్కడి పరిస్థితి (ఫోటోలు)

1:10 PM

వాడిపోయిన కమలం..హస్తం గుప్పిట్లోకి ఛత్తీస్‌గఢ్

ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. పదిహేనేళ్ల బీజేపీ పాలనకు తెరపడింది.. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన నాటి నుంచి గత మూడు ఎన్నికల్లో బీజేపీ ఎదురులేకుండా దూసుకెళ్లింది.

అయితే ప్రజా వ్యతిరేకతను అస్త్రంగా మలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి దీనిపై దృష్టి సారించి.. అందుకు అనుగుణంగా ఎత్తులు, పై ఎత్తులు వేసి విజయం సాధించింది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం బీజేపీకి కలిసొస్తుందని అందరూ భావించారు.

అయితే ఆయన గతంలో ఇచ్చిన హమీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో కమలంపై వ్యతిరేకత కనిపించింది. ఆకర్షణీయమైన పథకాలు కానీ, హామీలు కానీ రమణ్ సింగ్‌ని నెగ్గించలేకపోయాయి. మరోవైపు రైతులను ఆదుకోవడంలో బీజేపీ విఫలమైందంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం ఆ పార్టీకి మేలు కలిగించింది.

ఛత్తీస్‌గఢ్‌లో విజయం సాధించడంతో ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై చర్చ నడుస్తోంది. రేసులో సీనియర్ నేత, పీసీసీ అధ్యక్షుడు భూపేశ్ భగేల్ పేరు వినిపిస్తోంది.

రాష్ట్రం విడిపోక ముందు ఈయన 1993, 1998లో మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నియోజకవర్గం నుంచి  భూపేశ్ విజయం సాధించారు. 2013లో పటాన్ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. 2014 నుంచి ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు.

12:02 PM

చత్తీస్ ఘడ్ లో కొనసాగుతున్న కాంగ్రెస్ ఆధిక్యం

చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఆ పార్టీ ప్రస్తుతం 61 స్థానాల్లో ఆధిక్యంలో వుండగా, బిజెపి 19, ఇతరులు 10 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 

11:29 AM

లైవ్: ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలు: వెనుకంజలో సీఎం రమణ్ సింగ్

చత్తీస్ ఘడ్ లో హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ గా గానీ కుదిరితే కింగ్ గా మారాలనుకున్న మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కి షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆయన పోటీ చేసిన మార్వాహి నియోజకవర్గంలోనే మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడ బిజెపి మొదటి స్థానంలో, కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా జోగి అధ్యక్షుడుగా వున్న  సీజేసి  (ఛత్తీస్‌గఢ్‌ జనతా కాంగ్రెస్‌) మూడో స్థానంలో నిలిచింది. 

According to official ECI trends, former Chhattisgarh CM Ajit Jogi is at third position at Marwahi. BJP is leading and Congress at second ( file pic) pic.twitter.com/fhzR0IZIKl

— ANI (@ANI)

11:11 AM

లైవ్: ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలు: వెనుకంజలో సీఎం రమణ్ సింగ్

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. రాజ్‌నందగావ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ వెనుకంజలో ఉన్నారు. 

Chattisgarh Chief Minister Dr.Raman Singh trailing from Rajnandgaon, Congress's Karuna Shukla is leading (file pic) pic.twitter.com/BDmb8JgRGR

— ANI (@ANI)

10:48 AM

లైవ్: చత్తీస్ ఘడ్ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం

కాంగ్రెస్ పార్టీ చత్తీస్ ఘడ్ లో స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది.కాంగ్రెస్ 59 స్థానాల్లో, బిజెపి 24, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

10:18 AM

లైవ్: చత్తీస్ ఘడ్ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం

సర్వే ఫలితాలను తలకిందులు చేస్తూ చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 59 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతుండగా, బిజెపి 24 స్థానాల్లో బిజెపి, 7 స్థానాల్లో ఇతరుల ఆధిక్యం కొనసాగుతోంది. 

5:52 PM IST:

చత్తీస్ గడ్ ముక్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు రమణ్ సింగ్ ప్రకటించారు. బిజెపి పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు.తన సారథ్యంలో ఎన్నికలకు వెళ్లాము కాబట్టి ఈ ఓటమికి తానే భాద్యత వహిస్తానన్నారు. ప్రజల కోరిక మేరకు తాము ప్రతిపక్షంలో కొనసాగనున్నట్లు తెలిపారు. గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను అందిస్తానని రమణ్ సింగ్ వెల్లడించారు. 
  
5:33 PM IST:

చత్తీస్ గడ్ లో కాంగ్రెస్ పార్టీని విజయం వరిస్తుందని ముందుగానే తెలుసని...కానీ ఇంత భారీ విజయాన్ని ఊహించలేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు భూపేష్ భాఘెల్ ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వెలుడిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ 64 స్థానాల్లో లీడ్ లో ఉంది.  అధికార బిజెపి పార్టీ మాత్రం కేవలం 14 స్థానాలకే పరిమితమైంది. 

5:04 PM IST:

చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఎట్టకేలకు లీడింగ్ సాధించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో కమలం పార్టీ చిత్తుగా ఓడిపోయే స్థితిలో ఉంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా కొన్ని రౌండ్లలో వెనుకంజలో ఉండగా...తాజాగా ఆయన 3 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలోకి వెళ్లారు. దీంతో వ్యక్తిగతంగా ఘోర పరాభవం నుండి రమణ్ సింగ్ తప్పించుకున్నా...ముఖ్యమంత్రిగా మాత్రం ఓటమిపాలయ్యారు.    
 
4:24 PM IST:

ఛత్తీస్‌గఢ్‌ను బీజేపీకి కంచుకోటగా మార్చిన రమణ్ సింగ్‌కు నాలుగోసారి ఓటమి ఎదురైంది. ఇవాళ విడుదలైన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 90 స్థానాలకు గాను.. కాంగ్రెస్ 66, బీజేపీ 14, బీఎస్పీ-జేసీసీ 9, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు.

ఈ ఓటమితో ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ 15 ఏళ్ల పాలనకు చెక్ పడనుంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం డిసెంబర్ 7న సీఎంగా బాధ్యతలు చేపట్టిన రమణ్‌సింగ్ ఏకధాటిగా ఏలారు. నాలుగోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ చెప్పినప్పటికీ.. వాటని తారుమారు చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

ముఖ్యంగా రమణ్‌సింగ్‌పై తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉంది. ప్రజాకర్షక పథకాలతో పాటు నిరుపేదలకు చవక బియ్యం అందిస్తూ (చావల్ బాబా)గా పేరు సంపాదించుకున్నప్పటికీ.. రమణ్ సింగ్ ప్రజాగ్రహానికి గురయ్యారు. బంధుప్రితీ, అవనీతి ఆరోపణలకు తోడు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు, వెనుకబడిన వర్గాల వారి ఓటు కాంగ్రెస్ వైపు వెళ్లినట్లు రాజకీయ వర్గాలు అంచనాకు వస్తున్నారు.

సుధీర్ఘకాలం బీజేపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన బీజేపీ నేతగా నరేంద్రమోడీ పేరిట ఉన్న రికార్డును రమణ్‌సింగ్ బద్ధలు కొట్టారు. ప్రస్తుత ప్రధాని మోడీ గుజరాత్ సీఎంగా ఏకధాటికి 4,610 రోజులు ఉన్నారు. ఆ రికార్డును రమణ్‌సింగ్‌ బద్ధలుకొట్టారు. ఈ ఏడాది ఆగస్టుతో ఆయన ముఖ్యమంత్రిగా 5 వేల రోజులు పూర్తి చేసుకున్నారు. 

4:11 PM IST:

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలపై జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే) చీఫ్, మాజీ సీఎం అజిత్ జోగి స్పందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం తామేనని భావించి ప్రజలు తమ పార్టీకి మద్ధతుగా నిలిచారని జోగి పేర్కొన్నారు.

దాదాపు 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు బలంగా కోరుకున్నారని జోగి వ్యాఖ్యానించారు. వేరు కుంపటి పెట్టే వరకు అజిత్ జోగి కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారు.

తాజా ఎన్నికలు తాము రాష్ట్రంలో థర్డ్ ఫ్రంట్‌గా ఏర్పడేందుకు తోడ్పడుతున్నాయన్నారు. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 68, బీజేపీ 12, బీఎస్పీ-జేసీసీ 9, ఇతరులు 1 చోట గెలుపొందారు. 

2:39 PM IST:

బిజెపి ఓటమి ఖాయమవడంతో చత్తీస్ గడ్ రాజధాని రాయ్ పూర్ లోని బిజెపి కార్యాలయం నాయకులు, కార్యకర్తల సందడి లేక బోసిపోతోంది. 

ప్రస్తుతం అక్కడి పరిస్థితి (ఫోటోలు)

1:11 PM IST:

ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. పదిహేనేళ్ల బీజేపీ పాలనకు తెరపడింది.. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన నాటి నుంచి గత మూడు ఎన్నికల్లో బీజేపీ ఎదురులేకుండా దూసుకెళ్లింది.

అయితే ప్రజా వ్యతిరేకతను అస్త్రంగా మలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి దీనిపై దృష్టి సారించి.. అందుకు అనుగుణంగా ఎత్తులు, పై ఎత్తులు వేసి విజయం సాధించింది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం బీజేపీకి కలిసొస్తుందని అందరూ భావించారు.

అయితే ఆయన గతంలో ఇచ్చిన హమీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో కమలంపై వ్యతిరేకత కనిపించింది. ఆకర్షణీయమైన పథకాలు కానీ, హామీలు కానీ రమణ్ సింగ్‌ని నెగ్గించలేకపోయాయి. మరోవైపు రైతులను ఆదుకోవడంలో బీజేపీ విఫలమైందంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం ఆ పార్టీకి మేలు కలిగించింది.

ఛత్తీస్‌గఢ్‌లో విజయం సాధించడంతో ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై చర్చ నడుస్తోంది. రేసులో సీనియర్ నేత, పీసీసీ అధ్యక్షుడు భూపేశ్ భగేల్ పేరు వినిపిస్తోంది.

రాష్ట్రం విడిపోక ముందు ఈయన 1993, 1998లో మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నియోజకవర్గం నుంచి  భూపేశ్ విజయం సాధించారు. 2013లో పటాన్ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. 2014 నుంచి ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు.

12:01 PM IST:

చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఆ పార్టీ ప్రస్తుతం 61 స్థానాల్లో ఆధిక్యంలో వుండగా, బిజెపి 19, ఇతరులు 10 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 

11:29 AM IST:

చత్తీస్ ఘడ్ లో హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ గా గానీ కుదిరితే కింగ్ గా మారాలనుకున్న మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కి షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆయన పోటీ చేసిన మార్వాహి నియోజకవర్గంలోనే మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడ బిజెపి మొదటి స్థానంలో, కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా జోగి అధ్యక్షుడుగా వున్న  సీజేసి  (ఛత్తీస్‌గఢ్‌ జనతా కాంగ్రెస్‌) మూడో స్థానంలో నిలిచింది. 

According to official ECI trends, former Chhattisgarh CM Ajit Jogi is at third position at Marwahi. BJP is leading and Congress at second ( file pic) pic.twitter.com/fhzR0IZIKl

— ANI (@ANI)

11:22 AM IST:

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. రాజ్‌నందగావ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ వెనుకంజలో ఉన్నారు. 

Chattisgarh Chief Minister Dr.Raman Singh trailing from Rajnandgaon, Congress's Karuna Shukla is leading (file pic) pic.twitter.com/BDmb8JgRGR

— ANI (@ANI)

10:47 AM IST:

కాంగ్రెస్ పార్టీ చత్తీస్ ఘడ్ లో స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది.కాంగ్రెస్ 59 స్థానాల్లో, బిజెపి 24, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

10:18 AM IST: