‘కోవోవాక్స్‌’పై నిపుణుల కమిటీ సమావేశం నేడే..!  

By Rajesh KarampooriFirst Published Jan 11, 2023, 6:53 AM IST
Highlights

సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఓ) సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సమావేశం జనవరి 11న జరగనుంది. సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)లో ప్రభుత్వ , నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ ఇటీవల డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)కి ఒక లేఖ రాశారు, వయోజనులకు బూస్టర్ డోస్‌గా కోవాక్స్‌ను ఆమోదించాలని కోరారు.

Covovax Vaccine: కరోనా, ఒమిక్రాన్​ వేరియంట్ల వ్యాప్తితో ప్రపంచ దేశాలు భయాందోళనలకు గురవుతున్నాయి. కేసుల పెరుగుదల ప్రపంచ మానవాళిని గడగడలాడిస్తుంది. అనేక దేశాల్లో ఈ ఒమిక్రాన్​ సబ్​ వేరియంట్లు అలజడులు సృష్టిస్తున్నాయి. ఈ తరుణంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) ఓ గుడ్​ న్యూస్​ చెప్పింది. ఒమిక్రాన్ ను సమర్థంగా ఎదుర్కొనే కోవోవ్యాక్స్​ టీకాకు కేంద్రం త్వరలోనే ఆమోదం ఇస్తుందని తెలిపింది. 

కరోనా ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో పెద్దలకు కరోనా బూస్టర్ డోస్‌గా కోవోవ్యాక్స్ తీసుకోవడానికి ప్రభుత్వ ప్యానెల్ నేడు ఆమోదం (జనవరి 11) తెలుపనున్నది. సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీకి చెందిన నిపుణుల బృందం మార్కెట్‌లోకి విడుదల చేయనున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) కరోనా వ్యాక్సిన్ 'కోవోవాక్స్'ను ఆమోదం తెలుపనున్నది.  కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్ రెండు డోస్‌లు తీసుకున్న వారికి కోవోవాక్స్ ను బూస్టర్ ఇవ్వవచ్చని అధికారిక వర్గాలు తెలిపాయి.

ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఓ) సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సమావేశం జనవరి 11న జరగనుంది. సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)లో ప్రభుత్వ,   నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ ఇటీవల డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)కి ఒక లేఖ రాశారు, పెద్దలకు బూస్టర్ డోస్‌గా  'కోవోవాక్స్'ను ఆమోదించాలని కోరారు. కొన్ని దేశాల్లో అంటువ్యాధి పెరుగుతున్న పరిస్థితుల మధ్య, దీనిపై ముందస్తు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా కోవోవాక్స్‌ టీకాను పెద్దలకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి డిసెంబర్‌ 28, 2021న  DCGI ఆమోదించబడింది. ఆ తరువాత Covax ను  9 మార్చి 2022 నుంచి  12-17 ఏళ్ల పిల్లలకు, 28 జూన్ 2022న 7-11 సంవత్సరాల పిల్లలకు సైతం వ్యాక్సిన్‌ వేసేందుకు అనుమతులు జారీ చేసింది.  

మరోవైపు.. కోవోవాక్స్ టీకాకు బూస్ట‌ర్ డోసుగా మ‌రో 15 రోజుల్లో ఆమోదం ల‌భించ‌నున్న‌ట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పూనావాలా ప్రకటించారు. కోవోవాక్స్ టీకా ఒమిక్రాన్ వేరియంట్‌పై కూడా తీవ్ర ప్ర‌భావంతంగా పనిచేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. కేంద్రంవ‌ద్ద కోవీషీల్డ్ టీకాల స్టాక్ ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే.. కోవీషీల్డ్ క‌న్నా.. కోవోవాక్స్ బెస్ట్ బూస్ట‌ర్‌గా ప‌నిచేస్తుంద‌ని పూనావాలా దీమా వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అందించే విషయంలొ ప్ర‌పంచ‌దేశాల‌న్నీ భారత్ వైపు చూస్తున్నాయ‌ని, హెల్త్‌కేర్ అంశంలో భారీ జ‌నాభా ఉన్న మ‌న దేశం ఎలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌దో గ‌మ‌నిస్తున్నార‌ని, కరోనా వేళ ఇండియా 80 దేశాల‌కు సాయం చేసింద‌ని ఆయ‌న తెలిపారు.
 

click me!