Coronavirus: భారత్ లోనూ ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కరోనా వైరస్ (Coronavirus) కొత్త కేసులు లక్షల్లో నమోదుకావడం కోవిడ్-19 ఉధృతికి అద్దం పడుతున్నది. అయితే, కరోనా పరీక్షలు తగ్గుతుండటంపై కేంద్ర ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలను పెంచాలని రాష్ట్రాలకు సూచించింది.
Coronavirus: యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ గజగజ వణికిస్తున్నది. 2019లో చైనాలో వెలుగుచూసిన ఈ కోవిడ్ మహమ్మారి అతి తక్కువ కాలంలోనే అన్ని దేశాలకు వ్యాపించింది. నిత్యం అనేక మ్యుటేషన్లకు లోనవుతూ అత్యంత ప్రమాదకారిగా మారుతోంది. ఇదివరకు Coronavirus డెల్టా వేరియంట్ అన్ని దేశాల్లోనూ పంజా విసిరి.. లక్షలాది మంది ప్రాణాలు తీసుకోగా.. ప్రస్తుతం దాని కంటే ప్రమాదకరమైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దీంతో మళ్లీ కరోనా బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. భారత్ లోనూ ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కరోనా వైరస్ (Coronavirus) కొత్త కేసులు లక్షల్లో నమోదుకావడం కోవిడ్-19 ఉధృతికి అద్దం పడుతున్నది. మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్-19 పరీక్షలు తగ్గడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. కరోనా మహమ్మారి పరీక్షలను పెంచాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాకు సూచించింది.
దేశంలో కరోనా పెరుగుతున్న తరుణంలో కోవిడ్-19 పరీక్షలు తగ్గుతుండటంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. "నిర్దిష్ట ప్రాంతాలలో కరోనా వైరస్ కేసుల సానుకూల ధోరణిని దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక పద్ధతిలో కోవిడ్-19 పరీక్షలను వెంటనే పెంచాలని" కోరింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పోర్టల్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న... ప్రమాదకరమైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ కారణంగా దేశంలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. అయితే, పెరుగుతున్న కేసుల మధ్య అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కోవిడ్-19 పరీక్షలలో క్షీణతను చూపుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (ఆరోగ్యం) ఆర్తి అహుజా ఒక లేఖలో తెలిపారు.
undefined
కోవిడ్ పరీక్ష ప్రాథమిక లక్ష్యాన్ని త్వరితగతిన పెంచడం, ఐసోలేషన్, కోవిడ్ కేర్ కోసం ముందస్తుగా చర్యలు తీసుకోవడం.. పాండమిక్ మేనేజ్‌మెంట్‌కు కీలకమైన వ్యూహంగా పేర్కొంటూ, "కొత్త క్లస్టర్‌ల గుర్తింపు మరియు ఇన్‌ఫెక్షన్‌ల కొత్త హాట్‌స్పాట్‌లు కరోనా నిర్వహణను సులభతరం చేయగలవు. కంటైన్‌మెంట్ జోన్‌ల ఏర్పాటు, కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైనింగ్, ఐసోలేషన్ మరియు ఫాలోఅప్ వంటి నియంత్రణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి. ఇది ఇన్‌ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడానికి సహాయం చేయగలదు. రాష్ట్ర, జిల్లా పరిపాలన యంత్రాంగాలు ఈ విధంగా ముందుకు సాగలి" అంటూ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని, మరణాలను తగ్గించడంలో కోవిడ్-19 పరీక్షలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
కాగా, రాబోయే కాలంలో కొత్త వేరియంట్ (Coronavirus) లో మరిన్ని వైవిధ్యాలను ఉండే అవకాశాలు ఉన్నాయనీ, మరీ ముఖ్యంగా ఒమిక్రాన్ కారణంగా మరిన్ని వేరియంట్లు పుట్టుకు వస్తాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బోస్టన్ యూనివర్శిటీకి చెందిన ఎపిడిమాలజిస్ట్ లియోనార్డో మార్టినెజ్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో, అంత ఎక్కువగా రూపాంతరం చెందుతుందని అన్నారు. ఇలాంటి ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మున్ముందు అనేక రకాల వేరియంట్స్ పుట్టుకు వచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు. తదుపరి వేరియంట్ రాకను నిర్ధారించడానికి లేదా అంచనా వేయడానికి మార్గం లేదని చెప్పారు. అయితే భవిష్యత్ లో రాబోయే కరోనా వైరస్ (Coronavirus) రూపాంతరాలు స్వల్ప అనారోగ్యానికి కారణమవుతాయని అంచనా వేశారు. కానీ ఇదే పక్కగా ఉంటుందనే హామీ లేదని అన్నారు. ఇప్పుడున్న వాటికంటే ప్రమాదకరంగానూ విజృంభించే వేరియంట్లు కూడా ఉండవచ్చునని చెప్పారు.