థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత: అలా చేస్తే చర్యలు, రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్

By narsimha lodeFirst Published Oct 12, 2021, 2:59 PM IST
Highlights

థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ వినియోగించకుండా విక్రయించవద్దని కేంద్రం ఆదేశించింది.
 

న్యూఢిల్లీ: Thermal power కేంద్రాలకు coal కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మంగళవారం నాడు కీలక సూచనలు చేసింది.ప్రజల అవసరాల కోసం తమ పరిధిలో ఉన్న electricity ను ఉపయోగించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం.మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు సహాయం చేయాలని కోరింది.

also read:విద్యుత్ ధరలు, ఇంధన సమస్యలు... ఏపీని ఆదుకోండి: ప్రధాని మోడీకి జగన్ లేఖ

బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ముంచుకొచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న తరుణంలో మంగళవారం నాడు union government ఈ విషయాన్ని ప్రకటించింది.తమ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ను అందించకుండా విద్యుత్ ను విక్రయించకూడదని  రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది.సెంట్రల్ ఆపరేటింగ్ స్టేషన్ల వద్ద 15 శాతం విద్యుత్ ఏ రాష్ట్రాలకు కూడా కేటాయించకుండా ఉంటుంది.అత్యవసర విద్యుత్ అవసరం ఉన్న రాష్ట్రాలకు కేంద్రం తన కోటా నుండి విద్యుత్ ను అందించనుంది.

మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు కేంద్రానికి ఈ సమాచారం ఇవ్వాలని కోరింది. విద్యుత్ అవసరం ఉన్న రాష్ట్రాలకు ఈ విద్యుత్ ను ఉపయోగించుకోవచ్చని కేంద్రం అభిప్రాయపడింది.వినియోగదారులకు విద్యుత్ ఇవ్వకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని కేంద్రం హెచ్చరించింది.

ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఎన్టీపీసీ, డీవీసీ నుండి తమ డిమాండ్ మేరకు విద్యుత్ పొందేలా ఆదేశాలు జారీ చేసినట్టుగా ఇంధన శాఖ వివరించింది. ఈ నెల 10వ తేదీన ఢిల్లీ గరిష్ట డిమాండ్ 4536 మెగావాట్లు. ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నుండి అందిన డిమాండ్ మేరకు విద్యుత్ ను సరఫరా చేస్తున్నామని అధికారుల తెలిపారు.

థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం నాడు కీలక సమావేశం నిర్వహించారు. ఇవాళ ఇంధన, కోల్ ఇండియాకు చెందిన అధికారులు పీఎంఓ అధికారులతో భేటీ అయ్యారు.


 

click me!