రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి

By telugu teamFirst Published Oct 12, 2021, 2:25 PM IST
Highlights

చరిత్ర చీకట్లో కలిసిపోయిన అధ్యాయాలు ఎన్నో ఉన్నాయి. భూమిలో పాతుకుపోయిన నిజాలూ మరెన్నో ఉన్నాయి. భారత దేశ ఈశాన్య రాష్ట్రం మణిపూర్ చరిత్రలో మేజర్‌గా కనిపించే ఓ యుద్ధం తాలూకు శకలాలు ఇప్పుడు ప్రజలను బలితీసుకుంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో ఈ రాష్ట్రంలో పాతిపెట్టిన కొన్ని బాంబులు ఇప్పుడు పేలుతున్నాయి. వాటి గురించి తెలియని ప్రజలు భూమిపై గుంత కోసమో మరే అవసరం కోసమో తవ్వగా బద్ధలై ప్రాణాలు తీస్తున్నాయి.
 

న్యూఢిల్లీ: గతనెల ఇద్దరు అన్నదమ్ములు ఇంటి వెనుక పెరట్లో ఓ గుంత తవ్వుతున్నారు. తవ్వుతుండగానే బలమైన వస్తువు తగిలింది. వెంటనే బద్ధలై పేలింది. అంతే స్పాట్‌లోనే వారిద్దరూ మరణించారు. స్థానిక అధికారులు పరుగున అక్కడికి చేరుకున్నారు. గుంత తవ్వుతుంటే పేలుడు సంభవించి మరణించడంపై వారికేమీ అంతుచిక్కలేదు. ఆ ప్రాంతాన్ని పరిశీలించగా రెండో ప్రపంచయుద్ధ కాలంలో నాటిన bombs భద్రతంగా వారి ఇంటి వెనుక భూమిలో ఉన్నాయని తెలియవచ్చింది. ఆ బాంబులు అక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియదు. మనదేశంలో ఈశాన్య రాష్ట్రాల చరిత్ర ప్రత్యేకమైంది. ఈశాన్యంలోని మణిపూర్ రాష్ట్ర సరిహద్దులోని చిన్న పట్టణం మోరేలో ఈ ఘటన చోటుచేసుకుంది. గంగ్తే సోదరులు ఏడు దశాబ్దాల క్రితం నాటిన బాంబులకు బలయ్యారు.

1944లో second world warలో బ్రిటీష్, జపాన్‌లకు మధ్య భీకర యుద్ధం జరుగుతున్నది. indian, british సోల్జర్‌లతో కూడిన అలైడ్ ఫోర్సెస్ manipurలో japan సేనలపై వీరోచితంగా యుద్ధం చేశాయి. భారత్‌ను ఆక్రమించుకోవాలన్న జపాన్ వ్యూహాన్ని ఈ యుద్ధమే అడ్డుకుంది. UK వేడుక చేసుకునే డీడే, వాటర్లూ వంటి ప్రఖ్యాత యుద్ధాల తరహాలోనే imphal siege యుద్ధాన్ని బ్రిటన్లు స్మరించుకుంటుంటారు. మణిపూర్ యుద్ధంలో సుమారు 12,500 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.  

తాజా పేలుడు అప్పటి యుద్ధాన్ని మళ్లీ కళ్లముందుకు తెచ్చింది. చాలా యుద్ధాలకు అంతమనేది ఉండదనే సామెత  నిజమవుతున్నది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో పాతిపెట్టిన బాంబులు ఇప్పటికీ అమాయకుల ప్రాణాలను తీస్తున్నాయి. మణిపూర్ ప్రజలకు ఆ రాష్ట్ర చరిత్రపై అవగాహన ఉన్నది. వారి చరిత్రలో ఆ యుద్ధం కచ్చితంగా ప్రముఖ అధ్యాయంగా నిలిచిపోతుంది. కానీ, ఆ యుద్ధం ఎక్కడ జరిగిందనేదానిపై వారికి స్పష్టత లేదు. అరాంబమ్ సింగ్ అప్పటి యుద్ధ శకలాలను భద్రపరిచే బాధ్యత తీసుకున్నారు. కొందరేమో అదే పని పెట్టుకుని బాంబులను నిర్వీర్యం చేసి వాటిని చేపలు పట్టడానికి ఉపయోగించే చిన్నబాంబులను తయారు చేస్తున్నారు. ఆ బాంబుల లోహాలను ఇతర వస్తువుల తయారీకి ఉపయోగిస్తున్నారు.

Also Read: పాస్‌పోర్టు లేదని.. పసిఫిక్ మహా సముద్రాన్ని ఈది దేశాన్నే దాటేశాడు! ఆ దేశంలో కొత్త చిక్కులు..

గతేడాది నవంబర్‌లో రెండో ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన 122 బాంబులను, నిర్మాణాలను, 2017లో 18 బాంబులు, 600 బుల్లెట్లను ఇదే పట్టణంలో కనుగొన్నారు.

తాజాగా పేలిన బాంబుల కథనూ ఓ జవాన్ కొడుకు, ఇంజనీర్ ఆరంబమ్ సింగ్ వివరించాడు. ఇంఫాల్ యుద్ధంలో జపాన్ సైన్యం దూసుకువస్తుండగా అలైడ్ ఫోర్సెస్‌కు చెందిన ఇండియన్ డివిజన్ మిలిటరీ స్వల్ప సమయంలోనే కొంత మేరకు వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదిగో.. ఆ సందర్భంలోనే ఆ సైనికులు తమ ఆయుధ సంపత్తి, బాంబులను ఆదరాబాదరగా నేలలో పాతిపెట్టారు. కానీ, ఆ బాంబులు అక్కడ ఉన్నట్టు ఇప్పుడెవరికీ తెలియవు. నేడు ఆ ప్రాంతంపైనే నిర్మాణాలు వెలిశాయి. ఆ బాంబుల పైనే వాటి గురించి తెలియని ప్రజలు జీవిస్తున్నారు. ఎప్పుడైనా ఇలా తవ్వకాలు జరిపినప్పుడు వాటికి తగిలి బాంబులు పేలుతున్నాయి అని సింగ్ వివరించారు.

Also Read: వామ్మో.. అదేం డ్రైవింగ్ బాబోయ్.. కారు బానెట్‌పై పోలీసు ఎక్కి కూర్చున్నా ఆపని డ్రైవర్.. వీడియో వైరల్

యుద్ధ విమానాల ఇంజిన్లు, మోర్టార్లు, యుద్ధ ట్యాంకులు, గ్రెనేడ్లు, ఏరియల్ బాంబులు, ఇతర యుద్ధ సామగ్రిని తాము వెలికి తీశామని సింగ్ తెలిపారు. తమకు లభించిన చాలా బాంబుల్లో అధిక మొత్తం భారత అమ్యునిషన్ మేకింగ్ ఫ్యాక్టరీలో తయారైనవని తెలుస్తున్నదని వివరించారు. వీరే ఇంకో మిషన్ కూడా చేపడుతున్నారు. ఈ యుద్ధంలో మరణించిన యూకే, జపాన్ జవాన్ల మృతదేహాలు, వారికి అస్తికలు కనుగొనడానికీ ప్రయత్నిస్తున్నారు. ఆ దేశాల బాధిత కుటుంబాలు ఈ మేరకు వినతి చేయడంతో అందుకు ఉపక్రమించారు.

click me!