All Party Meet: వచ్చే నెల 2న అఖిల పక్ష సమావేశానికి కేంద్రం పిలుపు.. ఎందుకంటే?

By Mahesh K  |  First Published Nov 25, 2023, 8:06 PM IST

వచ్చే నెల 2వ తేదీన అఖిల పక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపు ఇచ్చింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4వ తేదీన ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాలకు ముందు ఆనవాయితీగా అఖిల పక్ష భేటీకి కేంద్రం నిర్ణయం తీసుకుంది.
 


న్యూఢిల్లీ: వచ్చే నెల 2వ తేదీన అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకటనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెలువరించారు. శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండు రోజుల ముందు అఖిల పక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4వ తేదీన ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 22వ తేదీ వరకూ కొనసాగతనున్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నవంబర్ 9వ తేదీన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో 15 సార్లు సిట్టింగ్ అవుతారని, 19 రోజులపాటు సమావేశాలు ఉంటాయని అప్పుడు కేంద్రమంత్రి జోషి తెలిపారు.

Latest Videos

Also Read: Narendra Modi: పీఎం మోడీ ఇలా.. బీజేపీ ఎంపీ ధర్మపురి అలా.. కేసీఆర్ పై అర్వింద్ పాజిటివ్ కామెంట్లు

శీతాకాల సమావేశాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీకి పిలుపు ఇచ్చింది. ఈ సమావేశాల్లో ముఖ్యమైన మూడు బిల్లులు.. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లపై చర్చ జరిగే అవకాశం ఉన్నది. వాస్తవానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లునూ ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నది.

click me!