ఆ విషయంలో ప్ర‌ధాని నా మాట విన్నారు: Rahul Gandhi

By Rajesh KFirst Published Dec 26, 2021, 12:39 PM IST
Highlights

కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులను వేయాలన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi)  స్పందించారు. కేంద్ర‌ప్ర‌భుత్వం  మొత్తానికి తానిచ్చిన సలహాను పాటించిందంటూ వ్యాఖ్యానించారు. 

ప్ర‌పంచ దేశాల‌ను దడపుట్టిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్ తాజాగా.. మ‌న‌ దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు నాలుగు వంద‌ల‌కు పైగా కేసులు న‌మోదయ్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా భ‌యాందోళ‌న‌లు తీవ్ర‌మ‌య్యాయి. ఈ క్రమంలో కేంద్రం ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. 
క‌రోనా కొత్త వేరియంట్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిస్‌ బూస్టర్‌ డోసులను వేయాలని నిర్ణ‌యించింది. 

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. మొత్తానికి తన సలహాలను కేంద్రం స్వీకరించిందని వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన ట్వీట్ చేశారు. *బూస్టర్‌ డోసుపై నేనిచ్చిన సలహాను కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. ఇది సరైన నిర్ణయం. వ్యాక్సిన్ల వల్ల వచ్చే రక్షణ ప్రతి ఒక్కరికీ చేరాలి. బూస్టర్ డోసులు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందాల్సిన అవసరం ఉంది ’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

Read Also : తెలంగాణ: కొత్తగా 140 మందికి కరోనా.. 6,80,553కి చేరిన మొత్తం కేసులు

ఆ ట్వీట్ కు గ‌తంలో చేసిన ట్విట్ ను జ‌త చేశాడు. ‘చాలా మందికి ఇంకా వ్యాక్సిన్లే వేయలేదు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోసులు ఇంకెప్పుడు వేస్తుంది?’ అని పేర్కొంటూ ఈ నెల 22న చేసిన ట్వీట్ నూ జత చేశారు. దేశంలో వ్యాక్సినేషన్‌ పురోగతిపై డిసెంబరు 22న రాహుల్‌ గాంధీ ఓ ట్వీట్‌ చేశారు. డిసెంబరు నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యామని గణాంకాల రూపంలో వెల్లడించారు. అందులోనే దేశంలో అత్యధిక మందికి టీకాలు ఇంకా అందలేదని తెలిపారు. అలాగే ఇంకా బూస్టర్‌ డోసులు ఎప్పుడు ఇవ్వడం ప్రారంభిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాజాగా కేంద్ర సర్కార్‌ ఆ దిశగా నిర్ణయం తీసుకోవడంతో తన సలహాను కేంద్రం స్వీకరించిందని ఆయన చెప్పుకొచ్చారు.

Read Also : Delmicron: ఒక‌వైపు ఒమిక్రాన్‌... మ‌రోవైపు డెల్మిక్రాన్ ! .. అమెరికాలో టెన్షన్ టెన్ష‌న్.. !

ఇదిలా ఉంటే.. ప్ర‌ధాని నరేంద్ర‌మోడీ శనివారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనాను ఎదుర్కోవడంలో ఇంతవరకు సాధించిన పురోగతిని, ఇకపై చేపట్టబోయే చర్యల్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో వ్యాక్సినేష‌న్ ను వేగ‌వంతం చేయ‌నున్న‌ట్టు తెలిపారు. అలాగే.. ఒమిక్రాన్ క‌ట్ట‌డి కోసం.. ప్రికాష‌న్ డోస్ వేయ‌నున్న‌ట్టు తెలిపారు. 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి ప్రికాషన్‌ డోసు అందించనున్నామని ప్రధాని శనివారం రాత్రి ప్రకటించారు. అలాగే.. దేశంలో 15-18 ఏళ్ల వయసు వారి కూడా క‌రోనా వ్యాక్సినేష‌న్ ను జ‌న‌వరి 3 నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు ప్రధాని తెలిపారు.

Read Also : omicron ఎఫెక్ట్ : కర్ణాటకలో 10 రోజులు నైట్ కర్ఫ్యూ

అదే నెల 10 నుంచి ఫ్రంట్ లైన్ వారియర్లు, ఆరోగ్య విభాగ సిబ్బందికి ,60 యేండ్లు దాటినా.. ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై ప్రికాషన్ డోసు అందించనున్నామని ప్రధాని ప్ర‌క‌టించారు. దాంతో పాటు పిల్లలకు వేసే కరోనా టీకా  కొవాగ్జిన్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి కూడా వచ్చిందని తెలిపారు. ఒమిక్రాన్‌ రకం వైరస్‌ విస్తృతి నేపథ్యంలో భయపడాల్సిన పని లేకపోయినా అప్రమత్తంగా ఉంటే స‌రిపోతుంద‌ని తెలిపారు. 

click me!