omicron ఎఫెక్ట్ : కర్ణాటకలో 10 రోజులు నైట్ కర్ఫ్యూ

By narsimha lodeFirst Published Dec 26, 2021, 12:25 PM IST
Highlights

కర్ణాటక రాష్ట్రంలో  ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. 10 రోజుల పాటు నైట్ కర్ఫ్యూను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

బెంగుళూరు: Karnataka రాష్ట్రంలోని డిసెంబర్ 28  నుండి రాత్రిపూట కర్ఫ్యూను అమల్లోకి తీసుకువస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 10 రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూను అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున  5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది  ఈ మేరకు ఇవాళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె . Sudhakar ఈ విషయాన్ని ప్రకటించారు.

రాష్ట్రంలో కరోనా Omicronకేసుల వ్యాప్తి పెరగకుండా ఉండేందుకు గాను  న్యూ ఇయర్ వేడుకలు, ఈవెంట్లపై కూడా ఆంక్షలను విధించింది. రాత్రి పూట 10 గంటల నుండి 5 గంటల వరకు కర్ఫ్యూతో పాటు 144 సెక్షన్ ను అమలు చేయాలని కూడా భావిస్తున్నామని కూడా రాష్ట్ర మంత్రి సుధాకర్ తెలిపారు.

ముఖ్యమంత్రి Basvaraju Bommai ఇవాళ సీనియర్ మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ సమావేశం తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ మీడియాకు నైట్ కర్ఫ్యూ విషయాన్ని తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో ఫంక్షన్లు, పార్టీలు ఏర్పాటుపై ప్రభుత్వం నిషేధం విధించింది. 

హోటల్స్, పబ్‌లు, రెస్టారెంట్లు వంటి వాటిల్లో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో ఉండవచ్చని మంత్రి తెలిపారు.కర్ణాటక రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్ కేసులు 32కి చేరుకొన్నాయి.  బెంగుళూరుకు దక్షిణాఫ్రికా నుండి వచ్చిన వ్యక్తికి కరోనా సోకిందని తేలింది. ఆయన శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్స్ కు పంపారు. 

ఇండియాలో ఇప్పటివరకు 422 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో ఎక్కువగా మహారాష్ట్ర ఢిల్లీ రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్నాయి.మరోవైపు కర్ణాటకతో పాటు  యూపీ, హర్యానా, ఢిల్లీ,గుజరాత్ రాష్ట్రాలు కూడా నైట్ కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చాయి.

also read:Omicron Cases in AP: మహమ్మారి బారిన మరో ఇద్దరు...ఏపీలో ఆరుకు చేరిన ఒమిక్రాన్ కేసులు

 దేశంలోని  17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు 130 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలాఉంటే కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 
.
ప్రస్తుతం దేశంలో 76,766 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 575 రోజుల తర్వాత క్రీయాశీల కేసుల సంఖ్య ఈ గణనీయంగా తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.30 శాతానికిపైగా ఉంది. దీంతో దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,42,30,354 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,79,682 మంది ప్రాణాలు కోల్పోయారు.దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 141.37 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

 

click me!