CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల ... ఎక్కడ చెక్ చేసుకోవాలో తెలుసా?

Published : May 13, 2025, 11:37 AM ISTUpdated : May 13, 2025, 11:57 AM IST
CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల ... ఎక్కడ చెక్ చేసుకోవాలో తెలుసా?

సారాంశం

CBSE 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా పరీక్షలు రాసినవారిలో 88.39% మంది పాసయ్యారని అధికారులు చెప్పారు.

CBSE 12వ తరగతి ఫలితాలు వచ్చేసాయి. 88.39% మంది పాసయ్యారని అధికారులు చెప్పారు. CBSE 12వ తరగతి బోర్డు పరీక్షల్లో అమ్మాయిలు మళ్ళీ అబ్బాయిల కంటే బాగా రాణించారు, 5 శాతం పాయింట్ల కంటే ఎక్కువ లీడ్ తో ఉన్నారన్నారు పరీక్షల నియంత్రణ అధికారి సన్యం భరద్వాజ్ చెప్పారు. మొత్తం పాస్ శాతం 88.39%గా ఉంది, గత సంవత్సరం ఫలితాలతో పోలిస్తే స్వల్పంగా మెరుగుపడిందన్నారు. 

విద్యార్థులు తమ ఫలితాలను CBSE అధికారిక వెబ్‌సైట్‌లైన cbse.gov.in, cbseresults.nic.in, results.cbse.nic.in లలో చూసుకోవచ్చు.  సిబిఎస్సి 12వ తరగతి ఉత్తీర్ణత నియమాల పరీక్షల నియంత్రణ అధికారి భరద్వాజ్ స్పష్టంగా తెలియజేసారు. 12వ తరగతి విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో థియరీ మరియు ప్రాక్టికల్/ప్రాజెక్ట్‌లో విడివిడిగా కనీసం 33% మార్కులు సాధించాలని తెలిపారు. అలాగే మొత్తంగా కూడా 33% మార్కులు తప్పనిసరి. ఏదైనా సబ్జెక్టులో 1-2 మార్కుల తేడాతో ఫెయిల్ అయితే బోర్డు గ్రేస్ మార్కులు ఇస్తుందని ఆయన తెలిపారు.

సిబిఎస్సి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థుల సౌలభ్యం కోసం CBSE డిజిలాకర్‌లో మార్క్స్ షీట్, పాస్ సర్టిఫికెట్, మైగ్రేషన్ సర్టిఫికెట్‌లను అందుబాటులో ఉంచుతుంది. విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు డిజిలాకర్ లాగిన్ వివరాలు, యాక్సెస్ కోడ్ SMS ద్వారా పంపబడతాయి. దీని ద్వారా విద్యార్థులు తమ డిజిటల్ మార్క్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది కెరీర్ మరియు ఉన్నత విద్యకు ఉపయోగపడుతుంది.

CBSE 12వ తరగతుల స్కోర్‌కార్డ్‌లో విద్యార్థి పేరు, రోల్ నంబర్, సబ్జెక్టుల వారీగా మార్కులు, థియరీ మరియు ప్రాక్టికల్ మార్కులు, ఉత్తీర్ణత స్థితి, మొత్తం మార్కులు వంటివి ఉంటాయి. ఆన్‌లైన్‌లో లభించే మార్క్స్ షీట్ తాత్కాలికమైనది. అసలు మార్క్స్ షీట్‌ను విద్యార్థులు తమ పాఠశాల నుంచి పొందాలి.

ఈసారి CBSE 10వ మరియు 12వ తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4, 2025 వరకు జరిగాయి. 10వ తరగతి పరీక్షలు మార్చి 18న ముగిశాయి. 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4న ముగిశాయి. ఈసారి పరీక్షలకు దాదాపు 42 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?