హత్రాస్‌ ఘటన: కేసు నమోదు, దర్యాప్తునకు సీబీఐ బృందం

By narsimha lodeFirst Published Oct 11, 2020, 2:15 PM IST
Highlights

హత్రాస్ లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐ విచారణను చేపట్టింది. ఇప్పటికే ఈ ఘటనపై కేసు కూడ నమోదు చేసింది.

లక్నో: హత్రాస్ లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐ విచారణను చేపట్టింది. ఇప్పటికే ఈ ఘటనపై కేసు కూడ నమోదు చేసింది.

హత్రాస్  ఘటన పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. యూపీలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. దీంతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ యూపీ సీఎం   యోగి ఆదిత్యనాథ్  కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు  ఈ కేసును సీబీఐ విచారణకు తీసుకొంది.

also read:సీసీటీవీలు, మెటల్ డిటెక్టర్లతో రక్షణ: హత్రాస్ బాధితురాలి ఇంటి వద్ద సెక్యూరిటీ

ఈ విషయమై   దర్యాప్తు కోసం ఓ కమిటిని ఏర్పాటు చేసినట్టుగా  సీబీఐ అధికార ప్రతినిధి ఆర్ కే గౌర్ తెలిపారు.సీబీఐ బృందానికి మహిళా అధికారి సీమా పౌజా నేతృత్వం వహిస్తున్నారు. ఆమె డిఎస్పీ ర్యాంక్ అధికారి.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సందీప్ సింగ్ పై ఐపీసీ 307 , 302 , 376 డీ సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ  అత్యాచారనిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టుగా అధికారులు తెలిపారు.

ఘటన జరిగిన ప్రాంతానికి సీబీఐ అధికారుల బృందం ఫోరెన్సిక్ టీమ్ తో కలిసి వెళ్లనుందని అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను వీలైనంత త్వరగా సేకరించాలని సీబీఐ అధికారులు స్థానిక పోలీసులను కోరారు.

యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తో కూడ తమ బృందం సంప్రదింపులు జరుపుతోందని సీబీఐ అధికారులు ధృవీకరించారు.యూపీ హోం సెక్రటరీ భగవాన్ స్వరూప్ శ్రీవాస్తవ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో యూపీ సెక్రటరీ సంప్రదింపులు జరుపుతోంది.
 

click me!