Lakhimpur Kheri: 23 మంది సాక్షులేనా? ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Published : Oct 26, 2021, 04:33 PM IST
Lakhimpur Kheri: 23 మంది సాక్షులేనా? ప్రశ్నించిన సుప్రీంకోర్టు

సారాంశం

లఖీంపూర్ ఖేరీ ఘటనపై యూపీ సర్కార్ పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.ఈ కేసులో 23 మంది మాత్రమే ప్రత్యక్ష సాక్షులు ఎందుకు ఉన్నారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

న్యూఢిల్లీ: Lakhimpur Kheri ఘటనపై Uttar Pradesh ప్రభుత్వంపై  Supreme court మంగళవారం నాడు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో 23 మంది మాత్రమే ప్రత్యక్ష సాక్షులు ఎందుకు ఉన్నారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ ఘటనకు సంబంధించి ఎక్కువ మంది సాక్షుల్ని గుర్తించి వారికి రక్షణ కల్పించాలని కూడా సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్నిఆదేశించింది.

also read:లఖింపుర్ కేసు.. ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడికి డెంగ్యూ.. ఆస్పత్రికి తరలింపు..

ఈ నెల 3వ తేదీన లఖీంపూర్‌ ఖేరీలో ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కారు దూసుకెళ్లింది.ఈ కారును అజయ్ మిశ్రా తనయుడు Ashish Mishra నడిపినట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి తోసిపుచ్చారు.ఈ కేసులో కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటనకు సంబంధించి మరింత మంది సాక్షులను గుర్తించి వారి నుండి స్టేట్‌మెంట్ ను సేకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాక్షుల వాంగ్మూలాలు  సేకరించేందుకు జిల్లా న్యాయమూర్తి తగిన ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కోరింది.ఈ ఘటనకు సంబంధించి 68 మంది సాక్షులున్నారని యూపీ ప్రభుత్వ తరపు న్యాయవాది హరీష్ సాల్వే చెప్పారు. అయితే వీరిలో 30 మంది వాంగ్మూలం నమోదు చేశామని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఎక్కువ మంది సాక్షులను ఎందుకు ప్రశ్నించలేదని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రశ్నించారు. 44 మంది సాక్షుల్లో నలుగురు సాక్షుల వాంగ్మూలాలు మాత్రమే  నమోదు చేశారని ప్రశ్నించింది.ఈ నెల 3న లఖీంపూర్ ఖేరీ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. తొలుత నలుగురు రైతులు మృతి చెందగా, ఆ తర్వాత చోటు చేసుకొన్న హింసలో మరో నలుగురు మృతి చెందారు.ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై సిట్ దర్యాప్తు చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం