నాలుగేళ్ల చిన్నారిని బైక్‌పై తీసుకెళ్తున్నారా? మీరు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

By telugu teamFirst Published Oct 26, 2021, 4:03 PM IST
Highlights

నాలుగేళ్ల చిన్నారిని బైక్ పై తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. చిన్న పిల్లల రక్షణార్థం కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఈ నిబంధనలను పాటించకుంటే ట్రాఫిక్ పోలీసులు కలుగజేసుకోవడం ఖాయం. కాబట్టి.. ఆ నిబంధనలేవో ఓ సారి చదివేసేయండి.
 

న్యూఢిల్లీ: అనేక కారణాల రీత్యా పిల్లలను అనివార్యంగా కొన్నిసార్లు Bikeపై తీసుకెళ్లే పరిస్థితులు ఏర్పడుతాయి. వెనుక వారిని ఎత్తుకుని కూర్చునే వారు ఉన్నప్పటికీ బైక్ నడపడం కొంత భయంతో కూడుకున్నట్టుగానే ఉంటుంది. ముందు కూర్చోబెట్టుకున్నా ఇదే ఆందోళన ఉంటుంది. ఎందుకంటే Children ఒక్కోసారి అనూహ్యంగా బిహేవ్ చేస్తారు. ఉన్నట్టుండి ఒకవైపు తూలుతారు. గెంతుతారు. ఇలాంటి సందర్భంలో అటు బైక్ బ్యాలెన్స్‌తోపాటు చిన్నారిని కాపాడటం కత్తిమీద సాములా మారుతుంది. అందుకే బైక్‌పై నాలుగేళ్ల చిన్నారులను తీసుకెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకువెళ్లాలి. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వమూ ఇందుకు సంబంధించి కొన్ని చట్ట సవరణలు చేసింది. వాటిని పాటించకపోతే Traffic పోలీసు జేబుకు చిల్లు పెట్టే అవకాశమూ ఉన్నది.

ఇక నుంచి నాలుగేళ్ల పిల్లలను బైక్‌పై తీసుకెళ్తున్నప్పుడు వారికి Safety Gear తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. ఆ సేఫ్టీ హార్నెస్‌ను రైడర్ భుజాలకు తగిలించుకుని చిన్నారి భద్రతకు తోడ్పడాలి. ఈ మేరకు మోటార్ వెహికల్ యాక్ట్‌లోని సెక్షన్ 129ను కేంద్ర ప్రభత్వం సవరించింది.

Also Read: Hyderabad Accident:మాదాపూర్ లో బైక్ యాక్సిడెంట్... యువకుడి మృతి, సోదరుడికి గాయాలు

దీని ప్రకారం, చిన్నారి టీషర్ట్ మాదిరిగా వేసుకునేలా సేఫ్టీ హార్నెస్ ఉండాలి. ఆ సేఫ్టీ గేర్ అడ్జస్టబుల్ అయి ఉండాలి. దానిని గట్టిగా పట్టి ఉంచే తాళ్లవంటివి డ్రైవర్ భుజానికి వేసుకునేలా ఉండాలి. తద్వార చిన్నారి భుజాలను గట్టిగా డ్రైవర్ పట్టుకుని ఉన్నట్టవుతంది.

ఆ సేఫ్టీ హార్నెస్ తక్కువ భారంతో వాటర్ ప్రూఫ్, డ్యూరేబుల్, అడ్జస్టబుల్ అయి ఉండాలి. హెవీ నైలాన్ లేదా మల్టీఫిలమెంట్ నైలాన్ మెటీరియల్‌తో తయారు చేసి ఉండాలి. కనీసం 30 కిలోల బరువును ఈ హార్నెస్ మోసే సామర్థ్యాని కలిగి ఉండాలని కేంద్రం తెలిపింది. 

అంతేకాదు, తొమ్మిది నెలల నుంచి నాలుగేళ్ల వయసున్న పిల్లలను బైక్ పై తీసుకెళ్తున్నప్పుడు ఆ చిన్నారికి సరిపడే క్రాష్ హెల్మెట్ లేదా బైసికిల్ హెల్మెట్ ధరింపజేయాలి. అంతేకాదు, ఆ పిల్లాడిని తీసుకెళ్తున్నప్పుడు బైక్ గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని మించవద్దు.

కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ ప్రకారం 2019లో రోడ్డు ప్రమాదాల్లో 11,168 మంది చిన్నారులు మరణించారు. అంటే రోజుకు 31 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 2018 కంటే ఈ సంఖ్య 1,191 ఎక్కువ. ఈ నేపథ్యంలోనే పిల్లల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఈ సవరణలు చేసింది.

click me!