కర్ణాటకలో సెక్స్ స్కాండల్: మంత్రి పదవికి రమేష్ రాజీనామా

By narsimha lodeFirst Published Mar 3, 2021, 2:26 PM IST
Highlights

కర్ణాటక రాష్ట్ర మంత్రి రమేష్ జర్కిహోలి బుధవారం నాడు మంత్రి పదవికి రాజీనామా చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన తన పదవికి బుధవారం నాడు రాజీనామా చేశారు.

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర మంత్రి రమేష్ జర్కిహోలి బుధవారం నాడు మంత్రి పదవికి రాజీనామా చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన తన పదవికి బుధవారం నాడు రాజీనామా చేశారు.

ఉద్యోగం ఇచ్చేందుకు గాను ఓ మహిళను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని మంత్రి రమేష్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ మహిళతో మంత్రి సన్నిహితంగా ఉన్న వీడియో మీడియాలో ప్రసారమైంది.

హక్కుల కార్యకర్త ఈ  వీడియోను మీడియాకు అందించిన తర్వాత ఆయన కన్పించకుండా పోయాడు.ఈ వీడియో కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈ వీడియో నకిలీదని మంత్రి చెప్పారు.తనపై ఆరోపణలు చేసిన మహిళతో పాటు ఫిర్యాదుదారుడు కూడ తనకు తెలియదన్నారు. 
తనపై ఆరోపణలు రుజువైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాలను విడిచిపెడతానన్నారు.ఈ విషయమై సమగ్ర దర్యాప్తు జరగాలని మంత్రి జార్కి హోలి చెప్పారు. 

ప్రభుత్వ ఉద్యోగం కోసం తనపై మంత్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించారు. మంత్రి తనతో గడిపిన దృశ్యాలు ఉన్న సీడీని పోలీసులకు అందించింది మహిళ. 

జార్కి హోలి  ముఖ్యమంత్రి యడియూరప్పకు రాజీనామా లేఖను పంపారు. పార్టీని కాపాడేందుకు తాను రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. తాను నిర్ధోషిగా నిరూపించబడితే తనను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన ఆ లేఖలో కోరారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదన్నారాయన.

మంత్రి సోదరుడు ఇవాళ ఉదయం సీఎంను కలిసి ఈ  ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన 17 మంది ఎమ్మెల్యేల బృందానికి జార్కిహోలి నాయకత్వం వహించారు. ఈ తిరుగుబాటుతో కాంగ్రెస్ ,జేడీఎస్ సంకీర్ణ సర్కార్ పతనానికి దారి తీసింది.

click me!