మూత్ర విసర్జన ఘటనపై ట్వీట్ చేసిన సింగర్ నేహా.. ఎఫ్ఐఆర్ నమోదు

Published : Jul 07, 2023, 08:03 PM IST
మూత్ర విసర్జన ఘటనపై ట్వీట్ చేసిన సింగర్ నేహా.. ఎఫ్ఐఆర్ నమోదు

సారాంశం

మూత్ర విసర్జన ఘటనపై ట్వీట్ చేసిన భోజ్ పూరి సింగర్ నేహా సింగ్ రాథోర్ పై భోపాల్‌లో కేసు ఫైల్ అయింది. మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటనను సూచించే కార్టూన్‌ షేర్ చేస్తూ.. ఆమె మధ్యప్రదేశ్‌లో ఏం జరుగుతున్నది? అంటూ కామెంట్ చేశారు.  

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన దేశమంతటా కలకలం రేపింది. అధికార పార్టీ బీజేపీపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. సున్నితమైన ఈ ఘటనపై భోజ్‌పురి సింగర్ నేహా సింగ్ రాథోర్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనను సూచించే ఓ కార్టూన్‌ను షేర్ చేస్తూ.. ‘మధ్యప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? త్వరలో వస్తున్నది’ అంటూ కామెంట్ చేశారు.

వైట్ షర్ట్, బ్లాక్ క్యాప్ ధరించి, ఖాకీ చెడ్డీను పక్కనపడేసిన వ్యక్తిని ప్రవేశ్ శుక్లాకు ప్రతీకగా తీసుకుని ఆ కార్టూన్ వేశారు. ఎదురుగా కూర్చున్న వ్యక్తిని దస్మేశ్ రావత్‌ను గిరిజనుడిగా ఆ కార్టూన్‌లో పేర్కొన్నారు. మూత్ర విసర్జన ఘటనను ఆ కార్టూన్ చిత్రిస్తున్నది. ఈ ఫొటోనూ సింగర్ నేహా సింగ్ రాథోర్ షేర్ చేశారు.

ఆమె యూపీలో ఏం జరుగుతున్నది. సీజన్ 2 పేరిట యూపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఫిబ్రవరిలో నేహా సింగ్ రాథోర్ ఓ పాటను విడుదల చేశారు. కాన్పూర్ దేహత్‌లో అక్రమ నివాసులను తరలించే డ్రైవ్ చేపడుతుండగా మరణించిన తల్లీ కూతురిని కేంద్రంగా తీసుకుని ఆ పాటను నేహా సింగ్ రాతోర్ పాడారు. తాజాగా, పై కార్టూన్ షేర్ చేస్తూ.. మధ్యప్రదేశ్‌లో ఏం జరుగుతున్నది? కమింగ్ సూన్ అంటూ క్యాప్షన్ పెట్టింది.

Also Read: తెలంగాణ ఎన్నికల ఇంచార్జీగా జవడేకర్, కో ఇంచార్జీగా సునీల్ బన్సల్‌ను నియమించిన బీజేపీ

సూరజ్ ఖారే అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భోపాల్‌లోని హబీబ్ గంజ్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆమెకు నోటీసులు జారీ అయ్యాయి.

దీని గురించి నేహా సింగ్ రాథోర్ స్పందించారు. తాను తన పాటలతో ఇలా ప్రభుత్వా న్ని ప్రశ్నించడం ఇదే తొలి సారి కాదని అన్నారు. తన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు ఇవ్వదని, కానీ, నోటీసులు మాత్రమే పంపిస్తుందని వివరించారు.

PREV
click me!

Recommended Stories

Tourism : ఏమిటీ.. 2025 లో 135 కోట్ల పర్యాటకులా..! ఆ ప్రాంతమేదో తెలుసా?
Silver Price Hike Explained in Telugu: వెండి ధర భయపెడుతోంది? | Asianet News Telugu