బాలాసోర్ రైలు ప్రమాదం‌ : ముగ్గురిని అరెస్ట్ చేసిన సీబీఐ, అంతా రైల్వే అధికారులే

Siva Kodati |  
Published : Jul 07, 2023, 06:34 PM IST
బాలాసోర్ రైలు ప్రమాదం‌ : ముగ్గురిని అరెస్ట్ చేసిన సీబీఐ, అంతా రైల్వే అధికారులే

సారాంశం

బాలాసోర్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ముగ్గురు రైల్వే అధికారులు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శుక్రవారం అరెస్ట్ చేసింది. వీరిలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్,  సెక్షన్ ఇంజినీర్, టెక్నీషియన్ వున్నారు.

దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిన బాలాసోర్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి శుక్రవారం ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరున్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజినీర్ మహమ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌లు వున్నారు. వీరిపై సీఆర్‌పీసీ 304, 201 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. 

 

 

కాగా.. ఒడిశాలోని బాలాసోర్‌ రైలు ప్రమాదంలో 291 మంది ప్రాణాలు కోల్పోగా... వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. తాజాగా రైల్వే సేఫ్టీ కమీషన్ (సీఆర్‌ఎస్‌) తన నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించింది. రైల్వే అధికారి ప్రకారం.. బాలాసోర్ రైలు ప్రమాదానికి సంబంధించిన ఈ నివేదిక సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ విభాగం యొక్క లోపాలను చూపుతోంది. రిలే రూం ఇన్‌చార్జి, ఉద్యోగులతో పాటు పలు శాఖల లోటుపాట్లు కూడా ప్రస్తావనకు తెచ్చింది.  

ప్రమాదానికి ‘మానవ తప్పిదం’ కారణమని రైల్వే సేఫ్టీ కమిషనర్ (సిఆర్‌ఎస్) ఆరోపించింది. దీనితో పాటు ఏ విధమైన విధ్వంసం లేదా సాంకేతిక లోపం గురించి చర్చను CRS తిరస్కరించింది. తమ విచారణలో కొందరు అధికారుల నిర్లక్ష్యం బయటపడిందని నిపుణులు పేర్కొంటున్నారు. తనిఖీల్లో అధికారులు తగిన భద్రతా విధానాలు పాటించలేదనీ,  మూడేళ్ల క్రితం భద్రతా కారణాల దృష్ట్యా డిజైన్‌లో మార్పులు చేసిన తర్వాత సరైన పరీక్షలు చేయలేదని నివేదిక పేర్కొనట్టు తెలుస్తోంది. 

భద్రతా నిబంధనలను సిగ్నలింగ్ విభాగంలోని వ్యక్తులే పట్టించుకోలేదని, ఇతరులు కూడా దానిని గుర్తించలేదని అధికారులు చెబుతున్నారు. ఆ అధికారులపై రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇంతకుముందు కేంద్ర బృందం తప్పును పట్టుకోవడంలో విఫలమైందని, ఆ తర్వాత వార్షిక విచారణలో కూడా పట్టుకోలేకపోయిందని ఒక అధికారి చెప్పారు. కనుక ఇది ఒకరి పొరపాటు ఫలితం కాదని, కనీసం 5 మంది తప్పు చేసి ఉండవచ్చని అంటున్నారు.  

ఈ ప్రమాదంపై  CRS విచారణతో పాటు, CBI కూడా విచారణ జరుపుతోంది. అలాగే సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు రైల్వే సిఆర్‌ఎస్ నివేదికను  బహిరంగపరచకూడదని రైల్వేశాఖ నిర్ణయించింది. సీబీఐ విచారణ వల్ల సీఆర్‌ఎస్‌ నివేదిక బయటకు విడుదల చేయడం లేదని అధికారులు తెలిపారు. CRS నివేదిక , CBI నివేదిక ఫలితాలను పరిగణలోకి తీసుకుంటామనీ, ఈ నివేదికలు భారతీయ రైల్వే భద్రతా వ్యవస్థలను పునరుద్ధరించడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు. రైల్వేలు ఉక్కు పరిశ్రమలో ఉపయోగించే అత్యుత్తమ సాంకేతికతలను, ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే రైల్వే భద్రతా వ్యవస్థలను పరిశీలిస్తున్నాయని అధికారులు తెలిపారు. 

సిగ్నల్ ఆధారంగా రైలు వేగాన్ని డ్రైవర్ నిర్ణయించడం వల్ల పొరపాటు జరగకుండా ఉండేందుకు యాంటీ కొలిజన్ పరికరాలను వినియోగించాలని పట్టుబడుతున్నామని అధికారి తెలిపారు. బాలాసోర్ వంటి ప్రమాదాలను నివారించడానికి రైల్వే నెట్‌వర్క్‌లో ఎలక్ట్రానిక్ రిలే సిస్టమ్‌లను విస్తృతంగా ఉపయోగించడాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.ఇవి రైలు భద్రత కోసం అత్యంత పటిష్టమైన, ప్రయత్నించిన  పరీక్షించబడిన వ్యవస్థలు.

దేశవ్యాప్తంగా ఇలాంటి విధానాన్ని అమలు చేయడానికి మూడేళ్లు పట్టవచ్చని, ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా చూసేందుకు రైల్వే , కేంద్రం  కట్టుబడి ఉన్నాయని అధికారి తెలిపారు. కొద్ది రోజుల క్రితమే.. రైల్వే బోర్డు తన అన్ని రిలే గదులకు రైలు నియంత్రణ వ్యవస్థతో పాటు డబుల్-లాకింగ్ అమరికను ప్రవేశపెట్టింది.ఇదిలా ఉంటే.. ప్రమాదం జరిగినప్పటి నుండి రైల్వే శాఖ ఆగ్నేయ రైల్వేకు చెందిన పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసింది, ఈ సంఘటన ఎవరి పరిధిలో జరిగింది. సిగ్నల్ వ్యవస్థలో నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోవడం ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం