Amit Shah : సీఏఏను కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఆ చట్టం అమలు కాకుండా ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. లోక్ సభ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
Citizenship (Amendment) Act : కేంద్ర ప్రభుత్వం తప్పకుండా పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దానిని అమలు చేయకుండా ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. రాబోయే లోక్ సభ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తాలో బీజేపీ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో కేంద్ర హోం మంత్రి ప్రసంగించారు. బుజ్జగింపు, చొరబాట్లు, అవినీతి, రాజకీయ హింస వంటి అంశాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
13,000 nude photos : ప్రియుడి ఫోన్ లో 13 వేల మంది మహిళల నగ్న ఫొటోలు.. షాక్ అయిన ప్రియురాలు..
undefined
పశ్చిమ బెంగాల్ లో 2026లో బీజేపీ రెండొంతుల మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రజల మనోగతానికి నిదర్శనమని అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రదర్శన అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి పునాది వేస్తుందని తెలిపారు.
ఈ క్రమంలో వివాదాస్పద సీఏఏ అంశాన్ని అమిత్ షా ప్రస్తావించారు. మమతా బెనర్జీ దీనిని వ్యతిరేకిస్తున్నారని, కానీ దాని అమలును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల బలమైన వైఖరి చూపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా తన నిబంధనలను రూపొందించలేదని అన్నారు. అందుకే ఈ అంశం గందరగోళంలో పడిందని చెప్పారు.
చట్టం ద్వారా లబ్దిపొందిన వారికి పౌరసత్వం పొందే హక్కు అందరిలాగే ఉందని అమిత్ షా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లోని 42 స్థానాలకు గాను బీజేపీ అత్యధికంగా 18 స్థానాలను గెలుచుకుంది. అయితే వచ్చే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పార్టీ లోక్ సభ ప్రచారానికి దిశానిర్దేశం చేసే లక్ష్యంతో నేడు భారీ ర్యాలీ నిర్వహించారు.