చెన్నై - పాలిటానా రైలులో ఫుడ్ పాయిజనింగ్ : 90 మందికి అస్వస్థత .. వాంతులు, విరోచనలతో అవస్థలు

By Siva Kodati  |  First Published Nov 29, 2023, 5:17 PM IST

చెన్నై - పాలిటానా మధ్య రైలులో ప్రయాణిస్తున్న 90 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్‌ బారినపడ్డారని రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. 90 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజనింగ్ గురించి ఫిర్యాదు చేశారని పీఆర్‌వో పేర్కొన్నారు. వికారం, లూజ్ మోషన్లు, తలనొప్పి లక్షణాలతో వీరంతా బాధపడినట్లుగా ఆయన వెల్లడించారు. 


చెన్నై - పాలిటానా మధ్య రైలులో ప్రయాణిస్తున్న 90 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్‌ బారినపడ్డారని రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. మహారాష్ట్రంలోని పూణే రైల్వే స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం వారందరికీ అవసరమైన చికిత్స అందించినట్లు వెల్లడించారు. అనంతరం 50 నిమిషాల తర్వాత రైలు బయల్దేరినట్లు అధికారులు తెలిపారు. ‘‘భారత్ గౌరవ్’’ రైలును గుజరాత్‌లోని పాలిటానాలో మతపరమైన కార్యక్రమం కోసం ఓ బృందం ప్రైవేట్‌గా బుక్ చేసినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ శివరాజ్ మనస్పురే తెలిపారు. 

ఈ బృందం ఆహారాన్ని ప్రైవేట్‌గా తెప్పించిందని, దానిని రైల్వే లేదా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (ఐఆర్‌సీటీసీ) సరఫరా చేయలేదని ఆయన వెల్లడించారు. ప్రయాణికులు తినే ఆహారాన్ని ప్యాంట్రీ కారులో తయారు చేసినట్లు చెప్పారు. సోలాపూర్ నుంచి పూణే మధ్య ఒక కోచ్ నుంచి దాదాపు 80 నుంచి 90 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజనింగ్ గురించి ఫిర్యాదు చేశారని పీఆర్‌వో పేర్కొన్నారు. వికారం, లూజ్ మోషన్లు, తలనొప్పి లక్షణాలతో వీరంతా బాధపడినట్లుగా ఆయన వెల్లడించారు. పూణే స్టేషన్‌లో వైద్యుల బృందం ప్రయాణీకులందరికీ చికిత్స అందించిందని పీఆర్‌వో చెప్పారు. 50 నిమిషాల తర్వాత రైలు బయల్దేరిందని వారి ఆరోగ్య పరిస్ధితి నిలకడగా వుందని ఆయన వెల్లడించారు. 

Latest Videos

click me!