130 కోట్ల భారతీయుల ఆశీర్వాదాలు తెచ్చా: నౌషీరాలో ఆర్మీ జవాన్లతో మోడీ దీపావళి వేడుకలు

By narsimha lodeFirst Published Nov 4, 2021, 12:22 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్‌లోని నౌషీరా, రాజౌరీలోని ఆర్మీ జవాన్లతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2014 నుండి దీపావళి వేడులను మోడీ ఆర్మీ జవాన్లతో నిర్వహించుకొంటున్నారు. 


 న్యూఢిల్లీ:తాను ఒక్కడినే రాలేదు... 130 కోట్ల భారతీయుల ఆశీర్వాదాలను ఇక్కడికి తీసుకు వచ్చానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. Jammu Kashmir లోని Nowshera, Rajouri లలో ఆర్మీ జవాన్లతో Prime Minister మోడీ  గురువారం నాడు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

తాను ప్రతి Diwali ని మన సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులతో గడుపుతున్న విషయాన్ని ఆయన  గుర్తు చేసుకొన్నారు. భద్రతా బలగాలే తన కుటుంబమని మోడీ తెలిపారు.మన జవాన్లు శతృవులకు ధీటైన జవాబు ఇస్తున్నారని ప్రధాని  ప్రశంసించారు.సైనికులతో దీపావళిని జరుపుకోవడం తనకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. మీ సామర్ధ్యం, బలం  దేశానికి శాంతి, భద్రతను నిర్ధారిస్తున్నాయని  చెప్పారు మోడీ..మీ వల్లే  పౌరులు పండుగలను జరుపుకొంటున్నారని ప్రధాని తెలిపారు.

also read:జమ్మూకు చేరుకొన్న మోడీ: ఆర్మీ జవాన్లతో దీపావళి వేడుకల్లో ప్రధాని

'మా భారతి'కి 'సురక్ష కవాచ్' మన సైనికులు అని ఆయన అభిప్రాయపడ్డారు. మీ అందరి వల్లే మన దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తున్నారని చెప్పారు. పండుగల సమయంలో ఆనందంగా ఉంటారన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో ఈ బ్రిగేడ్ పోషించిన పాత్ర ప్రతి భారతయుడిని గర్వంతో నింపుతుందన్నారు.

గతంలో భదత్రా దళాలకు  రక్షణ పరికరాలను అందించడానికి సంవత్సరాలు పట్టేదని ఆయన గుర్తు చేశారు. కానీ రక్షణ రంగంలో స్వావలంభన కోసం నిబద్దతతో పాత పద్దతులను మార్చాల్సిన అవసరం ఉందన్నారు.మారుతున్న ప్రపంచం, యుద్ధ విధానానికి అనుగుణంగా మనం కూడా మన సైనిక సామర్ధ్యాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని  మోడీ అభిప్రాయపడ్డారు. 

భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మనం చాలా ముందుకు వచ్చామన్నారు. ఇంతకుముందు భద్రతా బలగాల రక్షణ కోసం పరికరాలను కొనుగోలు చేయడానిక ఏళ్లు పట్టేది. కానీ భారతదేశం నేడు ఆత్మ నిర్భర్ దృష్టితో మన సైనికులకు అవసరమైన 200 రకాల ఆయుధాలను మనమే తయారు చేసుకొంటున్నామని చెప్పారు ప్రధాని మోడీ.

 దేశంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుందన్నారు. దీని కోసం ఎందరో త్యాగాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు మన ముందు కొత్త లక్ష్యాలు, సవాళ్లున్నాయన్నారు. తాను నౌషీరాలో అడుగుపెట్టిన సమయంలో  మన జవాన్ల శక్తి, సంకల్పాన్ని అనుభవించానని ప్రధాని పేర్కొన్నారు.  దేశ రక్షణకు ప్రాణాలను అర్పించే సాయుధ బలగాల బలానికి ఇది ప్రతీకగా ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు అనేక  ప్రయత్నాలు జరిగాయన్నారు. కానీ మనం బలంగా నిలబడిన విషయాన్ని ఆయన  ఈ సందర్భంగా ప్రస్తావించారు.

సరిహద్దు ప్రాంతాల్లో కనెక్టివిటి మెరుగుపడిందని మోడీ తెలిపారు. లడఖ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ , జైసల్మేర్ నుండి అండమాన్ , నికోబార్ దీవుల వరకు కనెక్టివిటి పెరిగిన విషయాన్ని మోడీ  గుర్తు చేశారు.

దేశ భద్రత విషయంలో మహిళల పాత్ర కొత్త శిఖరాలను తాకుతుందన్నారు. సైన్యంలో మహిళలకు పర్మినెంట్ కమిషన్ ఇస్తున్నట్టుగా ప్రధాని తెలిపారు. మహిళల కోసం ప్రధాన సైనిక సంస్థల తలుపులు కూడా తెరిచామన్నారు. 

click me!