Fuel Rates: పెట్రోల్‌, డీజిల్‌పై అదనపు తగ్గింపులు ప్రకటించిన 9 రాష్ట్రాలు.. అక్కడ లీటర్ పెట్రోల్ రూ. 98కే..

Published : Nov 04, 2021, 08:09 AM IST
Fuel Rates: పెట్రోల్‌, డీజిల్‌పై అదనపు తగ్గింపులు ప్రకటించిన 9 రాష్ట్రాలు.. అక్కడ లీటర్ పెట్రోల్ రూ. 98కే..

సారాంశం

కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై (petrol and diesel Price) సుంకాన్ని తగ్గిస్తున్నట్టుగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. బీజేపీ అధికారంలో ఉన్న తొమ్మిది రాష్ట్రాలు కూడా అదే రకమైన నిర్ణయం తీసుకున్నాయి. అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాట, గోవా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం తగ్గింపుతో పాటు లీటర్‌కు రూ. 7 అదనంగా తగ్గించాయి. 

దేశంలో కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు (petrol and diesel Price) పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వాహనదారులకు ఊరట కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని (excise duty) తగ్గిస్తున్నట్టుగా కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో వాహనాదారులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంది కొంతమేర ఊరట కలిగించే అంశమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాన్ని తగ్గిస్తున్నట్టుగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. బీజేపీ అధికారంలో ఉన్న తొమ్మిది రాష్ట్రాలు కూడా అదే రకమైన నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ పాలిత.. అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు పెట్రోల్, డీజిల్ ధరలలో అదనపు తగ్గింపులను ప్రకటించాయి. ఈ తగ్గిన ధరలు నవంబర్ 4 నుంచే అమల్లోకి రానున్నాయి.

Also read: Petrol , Diesel Price Cut: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు

అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాట, గోవా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం తగ్గింపుతో పాటు లీటర్‌కు రూ. 7 అదనంగా తగ్గించాయి. దీంతో అక్కడ మొత్తంగా లీటర్‌ పెట్రోల్‌పై రూ. 12, డీజిల్‌పై రూ. 17 తగ్గినట్టు అయింది. ఉత్తరాఖండ్‌లో పెట్రోల్‌పై వ్యాట్‌ను రూ. 2 తగ్గిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. మరోవైపు పెట్రోలు, డీజిల్‌పై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ను తగ్గించేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తెలిపారు.

‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దీపావళి కానుక.. కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ. 5, లీటర్ డీజిల్‌పై రూ. 10 తగ్గించింది. త్రిపుర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్‌ ధరలను అదనంగా రూ. 7 తగ్గిస్తుంది. ఈ నిర్ణయం తర్వాత అగర్తలాలో లీటర్ పెట్రోల్ రూ. 98.33, డీజిల్ రూ. 85.63 అవుతుంది’ అని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ ట్వీట్ చేశారు. 

ఇక, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో..  రెండింటిపై వ్యాట్ తగ్గించాలని రాష్ట్రాలు చాలా కాలంగా కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 120కి చేరగా, కొన్ని మెట్రో నగరాల్లో లీటర్ డీజిల్ ధర రూ. 100 దాటింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం