క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్: ఆర్యన్ అరెస్ట్ పెద్ద కుట్ర.. ముంబై పోలీసులకు అజ్ఞాత వ్యక్తి సమాచారం

By Siva KodatiFirst Published Nov 7, 2021, 5:29 PM IST
Highlights

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో (mumbai cruise drug case) కొత్త  కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఆర్యన్‌ను డబ్బు కోసమే ఈ కేసులో ఇరికించాడంటూ ఓ వ్యక్తి ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. క్రూయిజ్ షిప్‌లో రైడ్ కూడా ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందని అతను చెబుతున్నాడు

బాలీవుడ్ (bollywood) సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ ( shahrukh khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ (aryan khan) అరెస్ట్ కుట్రపూరితంగా జరిగిందా.. ? పక్కా ప్లాన్ ప్రకారమే ఆర్యన్‌ను డ్రగ్స్ కేసులో ఇరికించారా ..? ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో (mumbai cruise drug case) కొత్త  కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఆర్యన్‌ను డబ్బు కోసమే ఈ కేసులో ఇరికించాడంటూ ఓ వ్యక్తి ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. క్రూయిజ్ షిప్‌లో రైడ్ కూడా ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందని అతను చెబుతున్నాడు. దీనికి సంబంధించి సాక్ష్యాలు కూడా తన వద్ద వున్నాయని అంటున్నాడు ఆ వ్యక్తి. సెప్టెంబర్ 27న వ్యూహం రూపొందించి.. అనుకున్నట్లుగానే క్రూయిజ్ షిప్‌పై అక్టోబర్ 2న దాడి చేసినట్లు అతను చెబుతున్నాడు. 

అటు మహారాష్ట్ర (maharashtra) మంత్రి నవాబ్ మాలిక్ (nawab malik) సైతం ఇదే తరహాలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్ కేసు.. డ్రగ్స్ కేసు కానేకాదని, భారీ మొత్తంలో డబ్బులు గుంజేందుకు పన్నిన కిడ్నాప్ కుట్ర అని చెప్పారు. డ్రగ్స్ దొరికినట్లు చెబుతున్న క్రూయిజ్ షిప్‌లో పార్టీకి ఆర్యన్ వెళ్లలేదని.. పథకం ప్రకారమే అతనిని షిప్ దగ్గరకి రప్పించారని అన్నారు. ఆర్యన్ తమ చేతికి చిక్కగానే కిడ్నాప్ ముఠా .. షారుఖ్ ఖాన్‌తో బేరసారాలు జరిపారని, కొంత డబ్బు కూడా ముట్టిందని ఆరోపించారు. 

కానీ, ఒకే ఒక సెల్ఫీ ఆ కుట్రను నాశనం చేసిందని అన్నారు. క్రూయిజ్ షిప్‌పైకి వెళ్లడానికి ఆర్యన్ ఖాన్ టికెట్ కొనుగోలు చేయలేదని కోర్టులో చెప్పారని గుర్తుచేశారు. ప్రతీక్ గాబా, అమిర్ ఫర్నీచర్‌వాలాల వల్లే ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్‌కు వెళ్లారని పేర్కొన్నారు. ఇదంతా కూడా ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేయాలనే అని, పెద్ద మొత్తంలో సొమ్మును గుంజాలనే అని ఆరోపణలు చేశారు. బీజేపీ (bjp) లీడర్ మోహిత్ కంబోజ్ (mohit kamboj) బంధువు ఈ కుట్ర చేశారని వివరించారు. ఆర్యన్ ఖాన్‌ను అక్కడికి తీసుకెళ్లారని, కిడ్నాప్ గేమ్ ప్రారంభించారని నవాబ్ మాలిక్ అన్నారు. ఈ కిడ్నాప్ గేమ్‌లో  భాగంగానే రూ. 25 కోట్ల డీల్ గురించిన చర్చ జరిగిందని తెలిపారు. చివరికి ఈ డీల్ రూ. 18 కోట్లకు కుదిరిందని పేర్కొన్నారు. అందులో భాగంగానే రూ. 50 లక్షలు చేతులు మారాయని వివరించారు. కేవలం ఒక్క సెల్ఫీ మాత్రమే మొత్తం కథనంతా అడ్డం తిప్పిందని చెప్పారు. ఇదే వాస్తవమని తెలిపారు. 

Also Read:ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేయాలనే కుట్ర.. సెల్ఫీ వైరల్ కావడంతో విఫలం : వాంఖడేపై మంత్రి ఆరోపణలు

ఈ కేసులో బీజేపీ నేత మోహిత్ కంబోజ్ దీని వెనుక మాస్టర్ మైండ్ అని, ఈ కుట్రలో ఎన్‌సీబీ (ncb) అధికారి సమీర్ వాంఖడే (sameer wankhede) కూడా పార్ట్‌నర్‌గా ఉన్నారని మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. క్రూయిజ్ షిప్‌ డ్రగ్స్ తనిఖీలో ఆర్యన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రైవేటు డిటెక్టర్‌గా పేరున్న కేపీ గోసావి (kp gosavi) అనే ఓ వ్యక్తి ఆర్యన్ ఖాన్‌తో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనంతరం కేపీ గోసావి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసు పంచానామాలో సాక్షిగా సంతకం చేసిన కేపీ గోసావి, ఆయన బాడీగార్డ్‌ ప్రభాకర్ సాయిల్ (prabhakar sail) వార్తల్లోకి ఎక్కారు. 

ప్రభాకర్ సాయిల్ సంచలన ఆరోపణలతో సమీర్ వాంఖడే చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆర్యన్ ఖాన్ విడుదల కోసం ఓ డీల్ జరిగిందని, కేపీ గోసావి ఓ వ్యక్తితో ఫోన్‌లో డీల్ మాట్లాడాడని వెల్లడించారు. రూ. 25 కోట్ల డీల్ రూ. 18 కోట్లకు కుదిరిందని వివరించారు. ఇందులో ఎన్‌సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకూ వాటా ఉన్నదని ఆ ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ దొరికిందో లేదో కూడా తనకు తెలియదని ప్రభాకర్ సాయిల్ తెలిపారు. తెల్ల కాగితాలపై తన సంతకాన్ని తీసుకున్నారని వివరించారు.
 

click me!