కుటుంబ పార్టీలే పాలిస్తున్నాయి.. జగన్, కేసీఆర్‌లను టార్గెట్ చేసిన జేపీ నడ్డా

Siva Kodati |  
Published : Jun 29, 2023, 04:12 PM IST
కుటుంబ పార్టీలే పాలిస్తున్నాయి.. జగన్, కేసీఆర్‌లను టార్గెట్ చేసిన జేపీ నడ్డా

సారాంశం

వారసత్వ రాజకీయాలపై స్పందిస్తూ.. ఏపీ, తెలంగాణల్లోని పార్టీలపై మండిపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.  దక్షిణాదితో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలు వున్నాయని జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వారసత్వ రాజకీయాలపై స్పందిస్తూ.. ఏపీ, తెలంగాణల్లోని పార్టీలపై మండిపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే రాజకీయాలు చేస్తోందని, అలాగే ఏపీలో వైఎస్ జగన్ కుటుంబం పాలిస్తోందని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలపై బీజేపీ పోరాడుతోందన్నారు. దక్షిణాదితో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలు వున్నాయని జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇకపోతే .. ఇటీవల ప్రధాని మోడీ సైతం కుటుంబ రాజకీయాలపై మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన ‘మేరా బూత్‌.. సబ్‌సే మజ్‌బూత్‌’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కుటుంబ పార్టీలపై మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై విమర్శస్త్రాలను సంధించారు. "మీరు కరుణానిధి కుటుంబ బాగుండాలంటే.. డిఎంకెకు ఓటు వేయండి. సీఎం కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే.. బీఆర్ఎస్‌కు ఓటు వేయండి. మీరు మీ కుమారులు, కుమార్తెలు , మనవళ్ల సంక్షేమాన్ని కోరుకుంటే.. మాత్రం బీజేపీకి ఓటు వేయండి" అని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ.

ALso Read: కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే..బీఆర్‌ఎస్‌కు ఓటేయండి: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే..  తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీపై  బీజేపీ మృదువుగా వ్యవహరిస్తుందనే ఊహాగానాలు పెల్లుబిక్కుతున్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌తో సంబంధం ఉన్న కె కవితను అరెస్టు చేయకపోవడంపై బీజేపీలోని ఒక వర్గం నాయకులను అసంతృప్తిగా ఉంది. ఈ వాదనలకు ఊతమిస్తూ.. గత రెండేళ్లుగా  BRS పార్టీ కేంద్ర సమావేశాలను బహిష్కరించి, మణిపూర్ పరిస్థితిపై అఖిలపక్ష సమావేశానికి హాజరైంది. 

అలాగే.. విపక్షాలు పాట్నాలో వ్యూహాత్మక సమావేశం నిర్వహిస్తున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా , రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలవడానికి ఢిల్లీకి వెళ్లారు. ఈ పరిణామం కూడా పలు విమర్శలకు తావిచ్చింది. బిజెపి, బిఆర్‌ఎస్ లు ఓ అండర్ స్టాండింగ్ పై సాగుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో బీజేపీ అసంతృప్తి నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమయ్యారనే ప్రచారం సాగుతోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu