నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023: బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి ముందంజ

Published : Mar 02, 2023, 10:59 AM IST
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023: బీజేపీ-ఎన్‌డీపీపీ  కూటమి ముందంజ

సారాంశం

నాగాలాండ్  అసెంబ్లీ ఎన్నికల్లో   బీజేపీ  నేతృత్వంలో  సంకీర్ణ కూటమి  ముందంజలో  ఉంది.  2018 నుండి   ఎన్‌డీపీపీ, బీజేపీ మిత్రపక్షంగా  ఉన్నాయి.


న్యూఢిల్లీ: నాగాలాండ్  అసెంబ్లీ  ఎన్నికల్లో  బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి   ముందంజలో  ఉంది.  మొత్తం  60 అసెంబ్లీ స్థానాల్లో  బీజేపీ ,  ఆ పార్టీ మిత్రపక్షమైన ఎన్‌డీపీపీ అభ్యర్ధులు  41 స్థానాల్లో  ఆధిక్యంలో  ఉన్నారు. 

నాగా పీపుల్స్ ఫ్రంట్   ఐదు స్థానాల్లో  ఆధిక్యంలో  ఉండగా  కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో  ఆధిక్యంలో  కొనసాగుతుంది. నాగాలాండ్  అసెంబ్లీలోని 60 స్థానాల్లో  40 స్థానాల్లో  ఎన్‌డీపీపీ , 20 స్థానాల్లో  బీజేపీ పోటీ చేసింది. 

నాగాలాండ్  ముఖ్యమంత్రి  నీఫియు రియో  నేతృత్వంలోని ఎన్‌డీపీపీ  2018 నుండి బీజేపీతో  మిత్రపక్షంగా  కొనసాగుతుంది.  గత ఎన్నికల్లో బీజేపీ కూటమి  30 సీట్లను గెలుచుకుంది.  ఎన్‌పీఎఫ్  26 సీట్లలో విజయం సాధించింది.  నాగాలాండ్ రాష్ట్రాన్ని  2003 వరకు  కాంగ్రెస్ పార్టీ పాలించింది.  నాగాలాండ్  ప్రస్తుత  అసెంబ్లీలో  కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 

also read:త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023: ఆధిక్యంలో బీజేపీ

గత నెల  27వ తేదీన  రాష్ట్రంలోని  59 అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. జున్హెబోటో జిల్లాలోని  అకులుటో  స్థానంలో బీజేపీ  అభ్యర్ధి ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు.



 

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu