
హర్యానాలో దారుణం జరిగింది. ఓ కన్న తండ్రి కూతురుపై మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి తల్లి కూడా సహకరించింది. ఈ ఘటనలో కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు తండ్రిపై కేసు నమోదు చేశారు. త్వరలో నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నారు.
కేసీఆర్‌కు స్టాలిన్ షాక్: కాంగ్రెస్ ఫ్యాక్టర్, కేసీఆర్‌కు అందని ఆహ్వానం
వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానా రాష్ట్రం రేవారి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల బాలిక ప్రస్తుతం 12వ తరగతి చదువుతోంది. ఆమెకు 15 ఏళ్లు ఉన్నప్పుడు మొదటిసారిగా కన్నతండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం బాధితురాలు తల్లికి చెప్పింది. దీంతో భర్తను నిలదీయాల్సిన ఆమె అతడికే సపోర్ట్ గా నిలబడింది. కూతురుపై అత్యాచారానికి పాల్పడుతుంటే అతడికి సహకరించింది.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023: ఆధిక్యంలో బీజేపీ
ఇక అప్పటి నుంచి దాదాపు మూడేళ్లుగా ఆమె లైంగిక వేధింపులకు పాల్పడుతూనే ఉన్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే కాళ్లు, చేతులు నరికేస్తానని బెదిరించేవాడు. ఎంతో కాలంగా తండ్రి చేతిలో నరకయాతనకు గురైన బాలిక ఓపిక నశించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 12వ తరగతి పరీక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె మనసు మార్చుకొని వెంటనే పోలీసు స్టేషన్ కు వెళ్లింది. మూడు సంవత్సరాలుగా తనపై తండ్రి చేస్తున్న అఘాయిత్యాన్ని వారికి వివరించింది. తండ్రిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.
తండ్రి నేరపూరిత చర్యల గురించి తల్లికి కూడా తెలుసని, కానీ ఆమె ఈ దుశ్చర్యను ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆరోపించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితులైన తండ్రి, బాధితురాలి తల్లిపై 120బీ, 344, 376 (2) 506, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని త్వరలో కోర్టులో హాజరుపరిచి విచారణ జరుపుతామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో బిల్ గేట్స్ సమావేశం.. ఆ అంశాలపై ఆసక్తికర చర్చ..
ఇదిలా ఉండగా.. గత ఆదివారం రాత్రి బీహార్‌లోని బంకా ప్రాంతంలో రెండేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాధితురాలు భాగల్‌పూర్‌లోని మాయాగంజ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఆ బాలిక ఆదివారం అర్థరాత్రి సమయంలో పెళ్లి ఊరేగింపు చూసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. తరువాత కనిపించకుండా పోయింది. బాలిక కోసం వెతికినా తల్లిదండ్రులు ఆచూకీ లభించలేదు. అరగంట తర్వాత గ్రామానికి చెందిన ప్రదీప్ యాదవ్ అనే వ్యక్తి మైనర్ ను ఇంటి దగ్గర పడేసి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.