బీజేపీ ప్రభుత్వం అందరితో పోరాడుతోంది.. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకుంటేనే మంచిది -కేజ్రీవాల్

By Asianet NewsFirst Published Feb 4, 2023, 2:32 PM IST
Highlights

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందరితో గొడవపడుతోందని, అందరి పనుల్లో తలదూరుస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఎవరి పనిని వారు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని సూచించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలు, న్యాయమూర్తులు, రైతులు, వ్యాపారులతో పాటు అందరితోనూ పోరాడుతోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం వ్యవస్థ సుప్రీంకోర్టు, కేంద్రం మధ్య ప్రధాన వివాదంగా మారిందని ప్రచురితమైన ఓ కథనాన్ని ప్రస్తావిస్తూ.. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

తల్లిదండ్రులు కాబోతున్న కేరళ ట్రాన్స్ జెండర్ జంట.. దేశంలోనే మొదటిసారి..

‘‘కేంద్ర ప్రభుత్వం అందరితో ఎందుకు పోరాడుతోంది? న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు, వ్యాపారులతో.. అందరితో గొడవపడితే దేశం పురోభివృద్ధి చెందదు. మీ పని మీరు చేయండి. ఇతరులు పనిని చేసేందుకు వారికి అనుమతి ఇవ్వండి. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దు’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం పలు పాలన, అధికార పరిధికి సంబంధించిన విషయాల్లో కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ తో గత కొంత కాలంగా హోరాహోరీ పోరు సాగిస్తున్న విషయం తెలిసిందే. పాఠశాల ఉపాధ్యాయులను శిక్షణ కోసం ఫిన్లాండ్ కు పంపాలన్న తన ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ కేజ్రీవాల్ నెల రోజుల కిందట ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ నివాస్ కు ర్యాలీగా వెళ్లారు.

రామచరితమానస్ ను లోతుగా చదవాలి.. వాదనలు అనవసరం - ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ మా హోంవర్క్ ను తనిఖీ చేయడానికి ఎల్జీ మా ప్రధానోపాధ్యాయుడు కాదు. ఆయన మా ప్రతిపాదనలకు అవును లేదా కాదు అని చెప్పాలి. ఇలా ర్యాలీకి వేళ్లే ప‌రిస్థితులు రావ‌డం దుర‌దృష్ట‌క‌రం" అని అన్నారు. నిర్ణయాలు తీసుకునే అధికారం లేనప్పుడు ఎన్నికైన ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రశ్నించారు.

ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇంట సీఆర్‌పీఆఫ్ జవాన్ ఆత్మహత్య.. ఏకే 47తో రెండు రౌండ్లు కాల్చుకుని..!

గత నెలలో సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను, హైకోర్టు కొలీజియంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలని కోరుతూ న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సీజేఐకి రాసిన లేఖను కూడా కేజ్రీవాల్ తప్పుబట్టారు. ఇది అత్యంత ప్రమాదకరమని, న్యాయవ్యవస్థ నియామకాల్లో ప్రభుత్వం జోక్యం ఉండకూడదని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

click me!