రోడ్డు ప్రమాదంలో ఒడిశా బీఆర్ఎస్ నేత అర్జున్ దాస్ మృతి.. కేసీఆర్ సంతాపం..

Published : Feb 04, 2023, 02:29 PM IST
రోడ్డు ప్రమాదంలో ఒడిశా బీఆర్ఎస్ నేత అర్జున్ దాస్ మృతి.. కేసీఆర్ సంతాపం..

సారాంశం

ఒడిశాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత అర్జున్ చరణ్ దాస్ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదం ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

ఒడిశాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత అర్జున్ చరణ్ దాస్ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదం ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అర్జున్ దాస్ మోటారుసైకిల్‌పై ప్రయాణిస్తుండగా.. జాజ్‌పూర్ జిల్లాలోని బారుహాన్ సమీపంలోని ఖరస్రోటా నది వంతెనపై వేగంగా వచ్చిన ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అర్జున్ దాస్‌ను వెంటనే జాజ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో అర్జున్ దాస్‌తో పాటు ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు.

జాజ్‌పూర్ మాజీ ఎంపీ అనాది దాస్ కుమారుడైన అర్జున్ దాస్.. 1995 నుంచి 2000 మధ్య జాజ్‌పూర్ జిల్లాలోని బింజర్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉన్నారు. అర్జున్ దాస్ ఇటీవల హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం..
రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే అర్జున్ దాస్ ఆకస్మిక మృతి పట్ల బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.  

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !