తల్లిదండ్రులు కాబోతున్న కేరళ ట్రాన్స్ జెండర్ జంట.. దేశంలోనే మొదటిసారి..

By SumaBala BukkaFirst Published Feb 4, 2023, 1:36 PM IST
Highlights

జియా పావల్, ఆమె భాగస్వామి జహ్హాద్ ట్రాన్స్ జండర్ జంట. వీరిప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు. జహ్హాద్ ఇప్పుడు ఎనిమిది నెలల గర్భవతి అని జియా పావల్ ప్రకటించింది. అయితే జహ్హాద్ అమ్మాయిగా పుట్టి పురుషుడిగా మారాడు. 

కేరళ : జహద్, జియా పావల్ కేరళలోని కోజికోడ్‌ కు చెందిన ట్రాన్స్ జెండర్ జంట. దేశంలోనే మొట్ట మొదటిసారిగా బిడ్డకు జన్మనివ్వబోతున్న.. తల్లిదండ్రులు కాబోతున్న జంట వీరే. ఈ జంట వచ్చే నెలలో తమ బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. వీరిద్దరూ గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ శుభవార్తను వీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. జియా పావల్ నృత్యకారిణి, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో గర్భంతో ఉన్న జహ్హాద్ తో తన ఫొటోను షేర్ చేసింది. జహ్హాద్ ఇప్పుడు ఎనిమిది నెలల గర్భవతి అని ప్రకటించింది. 

జియాపావెల్ పురుషుడిగా పుట్టి స్త్రీగా మారింది, జహ్హాద్ స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిపోయాడు. వారిద్దరూ తమ పుట్టుకకు తమలోని మనిషికి తేడా తెలుసుకున్న తరువాత వారు యుక్తవయస్సులో కుటుంబాలను విడిచిపెట్టారు. “తల్లి కావాలనే నా కలను, తండ్రి కావాలనే అతని కలను సాకారం చేసుకోబోతున్నాం. ఎనిమిది నెలల పిండం ఇప్పుడు (జహాద్) కడుపులో ఉంది. మాకు ఉన్న సమాచారం ప్రకారం.. ఇది భారతదేశంలో మొదటి ట్రాన్స్ పర్సన్స్ గర్భం”అని పావల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు.

Kerala transgender couple about to become parents - bsb

"నేను పుట్టుకతో స్త్రీని కానప్పటికీ, ఒక శిశువుకు జన్మనిచ్చి.. 'అమ్మా' అని పిలిపించుకోవాలనే స్త్రీ కల నాలో ఉంది. మనం కలిసి మూడు సంవత్సరాలు అయ్యింది. నేను తల్లి, అతను (జహాద్) తండ్రి కావాలని కలలు కన్నాం. ఈ రోజు తన పూర్తి అంగీకారంతో ఎనిమిది నెలల ఓ పసిప్రాణం అతని కడుపులో ఊపిరి పోసుకుంటోంది" అని జియా పోస్ట్‌కు క్యాప్షన్‌లో రాసుకొచ్చింది.

రామచరితమానస్ ను లోతుగా చదవాలి.. వాదనలు అనవసరం - ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్

జియా అమ్మాయిగా, జహాద్ అబ్బాయిగా మారే హార్మోన్ థెరపీ చేయించుకున్నారు. అయితే, జహ్హాద్ పురుషుడిగా మారుతున్న క్రమం గర్భం దాల్చడం వల్ల ఆగిపోయింది. జహ్హాద్ రొమ్ము తొలగింపు శస్త్రచికిత్స ప్రక్రియ గర్భం కోసం ఆగిపోయింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఈ జంట ముందుగా ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని అనుకున్నాయి. ఆ ప్రక్రియ గురించి ఆరా తీశాయి. అయితే వారు లింగమార్పిడి జంట కావడంతో న్యాయపరమైన సవాల్ లు ఎదురయ్యాయి.  

తన కుటుంబ సభ్యులకు, వైద్యులకు తమకు మద్దతుగా నిలిచినందుకు పావల్ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నెలలో ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత జహ్హాద్ పూర్తిగా పురుషుడిగా మారే క్రమం కొనసాగుతుంది.  "జహ్హాద్ రెండు రొమ్ములను తీసివేస్తారు కాబట్టి.. వైద్య కళాశాలలో ఉన్న తల్లిపాల బ్యాంకు నుండి శిశువుకు పాలు అందించాలని అనుకుంటున్నాం’ అని జియా చెప్పారు.

ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి వేలాది మంది లైక్‌లు, కామెంట్‌లు చేస్తూ జంటను అభినందించారు. ఇంటర్నెట్ వినియోగదారులు వారి భవిష్యత్తు కోసం వారికి శుభాకాంక్షలు తెలిపారు. 


 

click me!