ప్రధాని మోదీతో బిల్ గేట్స్ సమావేశం.. వివిధ రంగాల్లో భారతదేశం పురోగతిపై ప్రశంసలు..

Published : Mar 04, 2023, 10:23 AM IST
ప్రధాని మోదీతో బిల్ గేట్స్ సమావేశం.. వివిధ రంగాల్లో భారతదేశం పురోగతిపై ప్రశంసలు..

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అసమానతలను తగ్గించడంలో సైన్స్, ఆవిష్కరణలు ఎలా సహాయపడతాయనే దాని గురించి ఇరువురు నేతలు  మాట్లాడుకున్నారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అసమానతలను తగ్గించడంలో సైన్స్, ఆవిష్కరణలు ఎలా సహాయపడతాయనే దాని గురించి ఇరువురు నేతలు  మాట్లాడుకున్నారు. తన భారత పర్యటన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీకి సంబంధించిన వివరాలను బిల్ గేట్స్ తన బ్లాగ్‌లో పంచుకున్నారు. తాను ఈ వారంతో భారత్‌లో ఉన్నట్టుగా చెప్పారు. ఆరోగ్యం, వాతావరణ మార్పులు, ఇతర కీలకమైన రంగాలలో భారత్‌లో జరుగుతున్న వినూత్న పని గురించి తెలుసుకున్నానని పేర్కొన్నారు. 

శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావడం తన పర్యటనలో ప్రధానాంశమని చెప్పారు. అలాగే భారత్ జీ20 ప్రెసిడెన్సీ గురించి కూడా చర్చించామని తెలిపారు. ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణం వంటి రంగాలలో భారతదేశం సాధిస్తున్న పురోగతిని బిల్ గేట్స్ ప్రశంసించారు. ఆవిష్కరణలో పెట్టుబడులు పెట్టినప్పుడు ఏమి సాధ్యమవుతుందనేది భారత్ చూపుతోందని అన్నారు.

‘‘కోవిడ్ మహమ్మారి కారణంగా నేను గత మూడేళ్లుగా పెద్దగా ప్రయాణించనప్పటికీ.. ప్రధాని మోదీ, నేను ప్రత్యేకంగా కోవిడ్-19 వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం, భారతదేశ ఆరోగ్య వ్యవస్థలలో పెట్టుబడి పెట్టడం గురించి టచ్‌లో ఉన్నాం. భారతదేశం చాలా సురక్షితమైన, సమర్థవంతమైన, సరసమైన వ్యాక్సిన్‌లను తయారు చేయగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది, వాటిలో కొన్నింటికి గేట్స్ ఫౌండేషన్ మద్దతు ఇస్తుంది. భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన టీకాలు మహమ్మారి సమయంలో మిలియన్ల మంది ప్రాణాలను కాపాడాయి. ప్రపంచవ్యాప్తంగా ఇతర వ్యాధులను నిరోధించాయి.

కొత్త లైఫ్‌ సేవింగ్ టూల్స్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు, వాటిని డెలివరీ చేయడంలో భారతదేశం కూడా రాణిస్తోంది. భారత్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ 2.2 బిలియన్ల కంటే ఎక్కువ కోవిడ్ వ్యాక్సిన్‌లను పంపిణీ చేసింది. వారు కో-విన్ అనే ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించారు. ఇది బిలియన్ల కొద్దీ వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడానికి ప్రజలను అనుమతించింది. టీకాలు వేసుకున్నవారికి వారికి డిజిటల్ ధృవీకరణలను అందించింది. ఈ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు భారతదేశం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌కు మద్దతుగా విస్తరించబడుతోంది. కో-విన్ ప్రపంచానికి ఒక నమూనా అని ప్రధాని మోదీ విశ్వసించారు.. దానిని నేను అంగీకరిస్తున్నాను.

మహమ్మారి సమయంలో భారతదేశం 200 మిలియన్ల మహిళలతో సహా 300 మిలియన్ల మందికి అత్యవసర డిజిటల్ చెల్లింపులను బదిలీ చేయగలిగింది. డిజిటల్ ఐడి సిస్టమ్ (ఆధార్ అని పిలుస్తారు)లో పెట్టుబడి పెట్టడం, డిజిటల్ బ్యాంకింగ్ కోసం వినూత్న ప్లాట్‌ఫారమ్‌లను రూపొందించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఒక అద్భుతమైన పెట్టుబడి అని చెప్పడానికి ఇది ఒక రిమాండర్.

ప్రభుత్వాలు మెరుగ్గా పని చేయడంలో డిజిటల్ టెక్నాలజీ ఎలా సహాయపడుతుందనేదానికి దేశంలోని గతి శక్తి కార్యక్రమం గొప్ప ఉదాహరణ. ఇది రైలు, రహదారులతో సహా 16 మంత్రిత్వ శాఖలను డిజిటల్‌గా కలుపుతుంది. తద్వారా వారు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం తమ ప్రణాళికలను ఏకీకృతం చేయవచ్చు. అలాగే భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల పనిని వేగవంతం చేయవచ్చు.

మేము ఈ సంవత్సరం భారతదేశం జీ20 ప్రెసిడెన్సీ గురించి కూడా చర్చించాము. భారతదేశంలో అభివృద్ధి చేయబడిన ఆవిష్కరణలు ప్రపంచానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తాయో హైలైట్ చేయడానికి, ఇతర దేశాలు వాటిని స్వీకరించడంలో సహాయపడటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం-ముఖ్యంగా దాని డిజిటల్ ఐటీ, చెల్లింపుల వ్యవస్థలను ఇతర ప్రదేశాలకు విస్తరించడం.. మా ఫౌండేషన్‌కు అత్యంత ప్రాధాన్యత.

క్షయ, విసెరల్ లీష్మానియాసిస్, శోషరస ఫైలేరియాసిస్ వంటి ప్రాణాంతకమైన, బలహీనపరిచే వ్యాధులను తొలగించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలపై నేను ప్రధానమంత్రిని అభినందించాను. ‘TB రోగులకు అవసరమైన పోషకాహారం, సంరక్షణను అందజేసేందుకు కమ్యూనిటీలు దత్తత తీసుకుంటున్నాయి. హెచ్‌ఐ విషయంలో భారతదేశం ఇదే విధానాన్ని అవలంభించింది. ఇది శాశ్వత ఫలితాలను ఇస్తుందని చూపబడింది’ అని భారతదేశంలో రూపుదిద్దుకుంటున్న మనోహరమైన ఉద్యమం గురించి ప్రధాని మోదీ నాకు తెలిపారు. 

మా సంభాషణలో విద్య మరొక అంశం. దేశవ్యాప్తంగా సార్వత్రిక పునాది అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం చొరవ గురించి చర్చించడం చాలా బాగుంది. మహమ్మారి దేశంలోని పాఠశాల వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసినప్పటికి.. అన్నిచోట్లా చేసినట్లుగా, టీవీతో సహా అనేక విభిన్న మార్గాల ద్వారా నేర్చుకోవడాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి భారతదేశం డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తోంది.

చివరగా ప్రధాని మోదీ, నేను వాతావరణ మార్పు గురించి మాట్లాడాము. మేము సంవత్సరాలుగా వాతావరణంపై కలిసి పని చేస్తున్నాము-మిషన్ ఇన్నోవేషన్‌లో భారతదేశం కీలక భాగస్వామి. ఈ కార్యక్రమం క్లీన్ ఎనర్జీ టెక్నాలజీల పనిని వేగవంతం చేయడానికి 2015లో ప్రారంభించబడిన కార్యక్రమం. ఈ డిసెంబర్‌లో జరిగే COP28 సమ్మిట్ సందర్భంగా  మిషన్ ఇన్నోవేషన్‌ భాగస్వాములతో కలిసి సరసమైన, నమ్మదగిన స్వచ్ఛమైన ఇంధన వనరుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి నేను ఎదురు చూస్తున్నాను’’ అని బిల్ గేట్స్ పేర్కొన్నారు. 

ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణంలో భారతదేశం సాధిస్తున్న పురోగతి గురించి ప్రధాని మోదీతో తన సంభాషణ గతంలో కంటే మరింత ఆశాజనకంగా ఉందని బిల్ గేట్స్ చెప్పారు. మనం ఇన్నోవేషన్‌లో పెట్టుబడులు పెడితే ఏమి సాధ్యమో భారత్ చూపిస్తోందని అన్నారు. భారతదేశం ఈ పురోగతిని కొనసాగిస్తుందని, దాని ఆవిష్కరణలను ప్రపంచంతో పంచుకోవాలని  తాను ఆశిస్తున్నట్టుగా చెప్పారు. గేట్స్ ఫౌండేషన్ కూడా ఇందులో భాగస్వామిగా ఉంటుందని చెప్పడానికి గర్విస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఇక, భారత పర్యటనలో ఇతర విశేషాలను కూడా బిల్ గేట్స్ షేర్ చేసుకున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?