Bike IED blast case: బైక్ ఐఈడీ పేలుడు కేసు.. పంజాబ్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

By Mahesh RajamoniFirst Published Jan 21, 2022, 11:34 PM IST
Highlights

National Investigation Agency: పంజాబ్ లోని జలాలాబాద్‌లో జరిగిన బైక్ ఐఈడీ పేలుడు కేసుకు సంబంధించి తమ దర్యాప్తులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు యాంటీ టెర్రర్ ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ ఎన్ఐఏ (National Investigation Agency-NIA) శుక్రవారం వెల్ల‌డించింది. 
 

National Investigation Agency: పంజాబ్ (Punjab ) లోని జలాలాబాద్‌లో జరిగిన బైక్ ఐఈడీ పేలుడు కేసుకు సంబంధించి తమ దర్యాప్తులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు యాంటీ టెర్రర్ ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ ఎన్ఐఏ (National Investigation Agency-NIA) శుక్రవారం వెల్ల‌డించింది. ఈ కేసుకు సంబంధించి పంజాబ్‌లోని తరణ్ టార్న్, ఫజిల్కా, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లోని ఐదు ప్రాంతాల్లో జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)  బృందాలు సోదాలు నిర్వహించాయని ఏజెన్సీ ప్రతినిధి ఒక‌రు తెలిపారు. 

 బైక్ ఐఈడీ పేలుడు కేసుకు సంబంధించి జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (National Investigation Agency-NIA) శుక్ర‌వారం పంజాబ్ (Punjab)లో జ‌రిపిన సోదాల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, మందుగుండు సామాగ్రి, డాక్యుమెంట్లు, స‌హా  నేరారోపణలకు సంబంధించిన ప‌లు కీల‌క వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్నట్లు NIA అధికారులు వెల్ల‌డించారు. రాష్ట్రంలోని ఫజిల్కాలోని జలాలాబాద్ పోలీస్ స్టేషన్ (Jalalabad police station) పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) సమీపంలో బజాజ్ ప్లాటినా బైక్‌లో  ఉంచిన ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘ‌ట‌న (Bike IED blast) లో బిందర్ సింగ్ అనే వ్యక్తి అక్కడికక్కడే  ప్రాణాలు కోల్పోయాడు. 

"నిందితులు పాకిస్థాన్ (Pakistan) ఆధారిత టెర్రరిస్టులు, స్మగ్లర్లతో టచ్‌లో ఉన్నారు. ర‌ద్దీగా ఉన్న ప్రాంతాల‌ను టార్గెట్ చేసుకుని ఈ దారుణాల‌కు ఒడిగ‌ట్ట‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ పేలుడు ఘ‌ట‌న (Bike IED blast) కు కార‌ణ‌మైన వారు ఉగ్రవాద దాడులకు రిక్రూట్ అయ్యారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది" అని అధికారులు వెల్ల‌డించారు. ఈ పేలుడు ఘ‌ట‌న‌పై 2021 సెప్టెంబ‌ర్ 16న  పంజాబ్ పోలీసులు మొద‌టి సారి  పేలుడు చ‌ట్టంలోని సెక్ష‌న్ 3, సెక్ష‌న్ 4 కింద కేసులు న‌మోదు చేశారు. జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (National Investigation Agency-NIA) సైతం 2021 సెప్టెంబరు 1న ఈ ఘ‌ట‌న‌పై ఫైల్ ఒపెన్ చేసి.. ద‌ర్వాప్తును ప్రారంభించింది.  ఈ పేలుడు ఘ‌ట‌న కేసు (Bike IED blast case) లో ఇప్ప‌టివ‌ర‌కు ఐదుగురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్టు జాతీయ ద‌ర్వాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు ఇంకా  కొనసాగుతున్న‌ద‌ని National Investigation Agency (NIA) అధికారులు పేర్కొన్నారు.  

ఇదిలా వుండగా, పంజాబ్ (Punjab) లో వచ్చే నెలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు (Punjab Elections 2022) జరగున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అధికారులు  అంచనా వేస్తున్నారు.  ఈ క్రమంలోనే పోలీసులు, నిఘా సంస్థలు రాష్ట్ర పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాయి. కాగా, పంజాబ్‌(Punjab) లో ఒకే దశలో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు (Punjab Elections 2022) జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2017 పంజాబ్ (Punjab) అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ 77 సీట్లు గెలుపొంది.. సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంది. మళ్లీ అధికార పీఠం దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది కాంగ్రెస్. 

click me!