Reliance: మూడో త్రైమాసికంలో అద‌ర‌గొట్టిన రిలయన్స్.. భారీగా పెరిగిన లాభాలు !

By Mahesh RajamoniFirst Published Jan 21, 2022, 10:48 PM IST
Highlights

Reliance: ఆసియాలోనే అత్యంత ధ‌న‌వండుడైన ముఖేష్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Ltd) మూడో త్రైమాసికంలో అద‌ర‌గొట్టింది. భారీ స్థాయిలో లాభాల‌ను ఆర్జించి..  ఆదాయాల‌ను పెంచుకుంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రిల‌యన్స్ రూ. 1.91 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో కంపెనీ నికర లాభం రూ. 18,549 కోట్లుగా ఉంది.
 

Reliance: ఆసియాలోనే అత్యంత ధ‌న‌వండుడైన ముఖేష్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Ltd) మూడో త్రైమాసికంలో అద‌ర‌గొట్టింది. భారీ స్థాయిలో లాభాల‌ను ఆర్జించి..  ఆదాయాల‌ను పెంచుకుంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రిల‌యన్స్ రూ. 1.91 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో కంపెనీ నికర లాభం రూ. 18,549 కోట్లుగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  (Reliance Industries Ltd) తన మూడో త్రైమాసిక ఫ‌లితాల‌ను శుక్ర‌వారం నాడు ప్ర‌క‌టించింది. 31 డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో (Q3FY22) రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ రూ. 1.91 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో కంపెనీ నికర లాభం రూ. 18,549 కోట్లుగా  ఉంద‌ని వెల్ల‌డించింది. గతేడాది త్రైమాసికంతో పోలిస్తే.. ఇది 41 శాతం ఎక్కువ. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.13,101 కోట్లుగా ఉంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  (Reliance Industries Ltd) తన మూడో త్రైమాసికంలో మెరుగైన ఫ‌లితాలు సాధించడంలో రిల‌య‌న్స్ జియో కీల‌క పాత్ర పోషించింది. జియో (Reliance Jio) అసమాన్య‌ పనితీరుతో 102 కోట్ల మంది కొత్త వినియోగ‌దారుల‌ను పొంద‌గ‌లిగింది. 2021-22 మూడవ త్రైమాసికంలో, జియో మొత్తం ఆదాయాలు 13.8 శాతం పెరిగి రూ.24,176 కోట్లకు చేరుకున్నాయ‌ని రిల‌య‌న్స్ వెల్ల‌డించింది. వీటిలో పన్నుకు ముందు లాభం రూ.10,008 కోట్లకు చేరుకోగా, నికర లాభం రూ.3,795 కోట్లకు పెరిగింది.  అంటే మొత్తంగా గ‌తేడాదితో పోలిస్తే ఇది 8.9 శాతం వృద్ధిని న‌మోదుచేసింది. కాగా, డిసెంబర్ 31 వరకు కంపెనీ కస్టమర్ల సంఖ్య 42.10 కోట్లుగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో 1.02 కోట్ల కొత్త కస్టమర్లు చేరారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. “మా అన్ని వ్యాపారాల నుండి బలమైన సహకారంతో 3Q FY22లో రిలయన్స్ అత్యుత్తమ త్రైమాసిక పనితీరును నమోదు చేసిందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. మా వినియోగదారుల వ్యాపారాలు, రిటైల్ మరియు డిజిటల్ సేవలు రెండూ అత్యధిక ఆదాయాలను, EBITDAను నమోదు చేశాయి. ఈ త్రైమాసికంలో, భవిష్యత్ వృద్ధిని నడపడానికి మా వ్యాపారాలలో వ్యూహాత్మక పెట్టుబడులు, భాగస్వామ్యాలపై దృష్టి సారించడం కొనసాగించాము" అని అన్నారు. మా వినియోగదారుల వ్యాపారాలు, రిటైల్ మరియు డిజిటల్ సేవలు రెండూ అత్యధిక ఆదాయాన్ని నమోదు చేశాయని తెలిపారు. 

Reliance Industries Ltd లో ప్ర‌ధాన‌మైన చమురు-రసాయనాల (O2C) విభాగంలో, మూడవ త్రైమాసికంలో ఆదాయం 57% పెరిగి ₹ 1.31 లక్షల కోట్లకు చేరుకుంది, ప్రధానంగా ముడి చమురు ధరల పెరుగుదల, అధిక వాల్యూమ్‌ల కారణంగా మంచి ఫ‌లితాలు రాబ‌ట్టింది. "గ్లోబల్ ఆయిల్, ఎనర్జీ మార్కెట్లలో పునరుద్ధరణ బలమైన ఇంధన మార్జిన్‌లకు మద్దతు ఇచ్చింది. మా O2C వ్యాపారం బలమైన ఆదాయాలను అందించడంలో సహాయపడింది. మా ఆయిల్ & గ్యాస్ సెగ్మెంట్ వాల్యూమ్ పెరుగుదల మరియు మెరుగైన రియలైజేషన్‌తో EBITDAలో బలమైన వృద్ధిని అందించింది" అని అంబానీ చెప్పారు. అదే సమయంలో, రిలయన్స్ రిటైల్ ఏకీకృత స్థూల ఆదాయం రిపోర్టింగ్ త్రైమాసికంలో 52% పెరిగి ₹ 57,714 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ రిటైల్ రిపోర్టింగ్ త్రైమాసికంలో ₹ 2,259 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది కాలంతో పోలిస్తే ఇది 23% ఎక్కువ.
 

click me!