రేపు జిల్లా కలెక్టర్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.. పథకాల పురోగతిని తెలుసుకోనున్న మోడీ

By Rajesh KFirst Published Jan 21, 2022, 9:55 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (narendra modi) శనివారం వివిధ జిల్లాల కలెక్టర్లతో (district collectors)సంభాషించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతి, ప్రస్తుత స్థితిగతులపై నేరుగా అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (narendra modi) శనివారం వివిధ జిల్లాల కలెక్టర్లతో (district collectors)సంభాషించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతి, ప్రస్తుత స్థితిగతులపై నేరుగా అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ ఇంటరాక్షన్.. ప్రభుత్వ యంత్రాంగం పనితీరును సమీక్షించడానికి, ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకోవడానికి ప్రధాని మోడీకి సహాయపడనుంది. 

మిషన్ మోడ్‌లో జిల్లాల్లోని వివిధ శాఖల ద్వారా వివిధ పథకాల సంతృప్తతను సాధించడం, అందరితో కలిసిపోవడమే దీని లక్ష్యం అని ప్రధాన మంత్రి కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశవ్యాప్తంగా అభివృద్ధి,  అభివృద్ధిలో అసమానతను అధిగమించడానికి నిరంతరం చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. ఇది పౌరులందరి జీవన ప్రమాణాలను పెంపొందించడం, అందరికీ సమ్మిళిత వృద్ధిని నిర్ధారించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఉంది అని పీఎంవో తెలిపింది.

ఈ నెల ప్రారంభంలో.. దేశంలో కోవిడ్ మహమ్మారి పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని మోడీ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జనవరి 9న జరిగిన ఈ సమావేశంలో ప్రపంచంతో పాటు దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల ఉద్ధృతికి సంబంధించి ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రధానికి వివరించారు. సవాలును ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు మద్దతు ఇచ్చే విషయంలో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ ప్రయత్నాలను తెలిపారు. 

ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ (ECRP-II) కింద ఆరోగ్య మౌలిక సదుపాయాలు, టెస్టింగ్ కెపాసిటీ, ఆక్సిజన్, ఐసియు బెడ్‌ల లభ్యత, అవసరమైన ఔషధాల స్టాక్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి రాష్ట్రాలకు మద్దతు అందిస్తోంది. జిల్లా స్థాయిలో తగిన ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ఆవశ్యకతను ప్రధాని మోడీ అప్పుడే నొక్కిచెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్రాలతో సమన్వయాన్ని కొనసాగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

click me!