దేశంలో భాషా వివాదం ముదురుతోంది. తమపై హిందీని బలవంతంగా రుద్దుతుతోందని ఇప్పటికే తమిళనాడు ఉద్యమం మొదలు పెట్టింది. కాగా ఇప్పుడు ఈ జాబితాలోకి కర్ణాటక వచ్చి చేరింది. బెంగళూరు ఎయిర్‌పోర్టులో సైన్‌బోర్డుల నుంచి హిందీని తీసేసింది. ఇప్పుడు కన్నడ, ఇంగ్లీషులో మాత్రమే సమాచారం ఉంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారులు స్పష్టత ఇచ్చారు.
బెంగళూరులోని కేంపెగౌడ ఎయిర్‌పోర్టులో సైన్‌బోర్డులన్నింటి నుంచీ హిందీని తీసేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బెంగళూరు విమానాశ్రయంలో కన్నడ, ఇంగ్లీషులో మాత్రమే సమాచారం అందిస్తున్నారు. ఈ మార్పునకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా Xలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని ఇప్పటిదాకా రెండు మిలియన్ల మందికి పైగా చూశారు. దీనిపై రకరకాల కామెంట్లు వచ్చాయి.
కొందరు ఈ పనిని మెచ్చుకున్నారు. ఎందుకంటే ఇది కన్నడ భాషకు సపోర్ట్ చేస్తుంది. కానీ చాలామంది ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పని విమర్శిస్తున్నారు. ఒక యూజర్ ఈ మార్పును ప్రశ్నిస్తూ, "ఇంగ్లీషు, కన్నడ తెలిసిన వాళ్ళు మాత్రమే బెంగళూరు వస్తారని అనుకుంటున్నారా? మెట్రో స్టేషన్లలో హిందీ లేకపోవడం అర్థం చేసుకోవచ్చు, కానీ ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో ఉండాలి కదా" అని రాశారు. ఇంకో యూజర్ రాస్తూ, "దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ భారతదేశానికి గౌరవం చూపించడానికి హిందీలో ట్వీట్ చేస్తే, మన సొంత ప్రజలే హిందీని పట్టించుకోరు. ఇది ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో ఒకటి" అన్నారు.
Hindi is removed in digital display boards of Kempegowda International airport in Bengaluru.
Kannada & English. are resisting Hindi imposition.
This is a really good development ! 👌pic.twitter.com/Ll98yTOdbU
— ಚಯ್ತನ್ಯ ಗವ್ಡ (@Ellarakannada)
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై చర్చ మొదలైంది. ఎయిర్‌పోర్టులో డిజిటల్ డిస్‌ప్లే బోర్డుపై కన్నడ, ఇంగ్లీషు, ఉర్దూలో సమాచారం చూపిస్తున్నారు కానీ హిందీలో లేదు. దేశంలో 40 శాతం కంటే ఎక్కువ మంది హిందీ మాట్లాడే చోట ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
ఈ వార్తలపై బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ స్పందించింది. తమ ఫ్లైట్ ఇన్‌ఫర్మేషన్ డిస్ప్లే వ్యవస్థలో ఎలాంటి మార్పూ జరగలేదని, గతం నుంచి కొనసాగుతోన్న విధానమే ఇప్పుడు కొనసాగుతోందని స్పష్టతనిచ్చారు. ప్రయాణికులకు సులభంగా సమాచారం అందించేందుకు డిస్ప్లేలో ఇంగ్లీష్, కన్నడ భాషలే ఉపయోగిస్తున్నాం. అలాగే టెర్మినల్స్ అంతటా దారి చూపించే సైన్ బోర్డుల్లో ఇంగ్లీష్, కన్నడ, హిందీ భాషల్లో ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. దీంతో హిందీ బాషను తొలగించారని జరుగుతోన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.